భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న సుకుమార్!

మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తన 25 వ సినిమా అయిన ‘మహర్షి’ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తవ్వగానే ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై సుకుమార్ డైరెక్షన్లో ‘మహేష్ 26’ వ సినిమా తెరకెక్కనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే మొదట సుకుమార్ చెప్పిన కధలు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసాడంట. తరువాత కొరటాల శివ డైరెక్షన్లో ‘మహేష్ 26’ తెరకెక్కబోతున్నట్టు మరో వార్త వచ్చింది. దీనిని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించబోతుందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మరో వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.

తాజాగా మహేష్ తో చేయబోయే చిత్ర కథ కోసం సుకుమార్ తన టీంతో కలిసి థాయిలాండ్ వెళ్ళొచ్చాడంట . వచ్చిన వెంటనే మహేష్ కు పూర్తి స్క్రిప్ట్ వినిపించాడట. ఈ సరి సుక్కూ వినిపించిన కథ మహేష్ కు నచ్చడంతో ఈ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని టాక్. 2019 మార్చ్ లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో తెరకెక్కబోతోన్న ఈ చిత్రానికి సుకుమార్ దాదాపు 15 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకోబోతున్నాడట. సుకుమార్ ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్ళువడనున్నాయని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus