సుకుమార్ సినిమాల్లో ఆ సమస్య ఎప్పుడూ ఉండేదే.!

  • March 26, 2018 / 12:30 PM IST

ఇదివరకంటే ఎక్కడో ఉర్ల నుంచి బండ్లు కట్టించుకొని వచ్చేవారు కాబట్టి సినిమా మూడు గంటలైనా, మూడున్నర గంటలైనా థియేటర్ లో కష్టపడి కూర్చుని సినిమాలు చూసేవారు. కానీ.. ఇప్పటి పరిస్థితులు వేరు టైమ్ పాస్ కోసం సినిమాలు చూసేవారి సంఖ్యే ఎక్కువ. అందువల్ల సినిమా రెండు గంటలకంటే ఏమాత్రం ఎక్కువున్నా జనాలు చూడట్లేదు. ఏదో గతేడాది వచ్చిన “అర్జున్ రెడ్డి” ఒక్కటి హిట్ అయ్యిందనే ఉద్దేశ్యంతో మళ్ళీ దర్శకులు తమ సినిమాల నిడివి విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. కానీ.. “అర్జున్ రెడ్డి” కాకుండా రెండున్నర గంటలు మించిన నిడివిత్ప్ విజయం సాధించిన మరో చిత్రం ఈమధ్యకాలంలో లేదనే చెప్పాలి. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొన్నారో లేదో కానీ “రంగస్థలం” రన్ టైమ్ ని ఏకంగా 165 నిమిషాలు అనగా రెండు గంటలా నలబై అయిదు నిమిషాలు, అంటే ఇంటర్వెల్ తో మూడు గంటల పడుతుంది “రంగస్థలం” సినిమా పూర్తయ్యేసరికి.

సుకుమార్ మునుపటి సినిమాలు “ఒన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో” కూడా ఇంచుమించుగా ఇదే రన్ టైమ్ తో నడిచాయి. అయితే.. సదరు సినిమాల రిజల్ట్స్ ఏమిటనేది ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు “రంగస్థలం” సినిమా నిడివి విషయంలోనూ మెగా ఫ్యాన్స్ అదే విధంగా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. విలేజ్ పోలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ ఇవాళ పూర్తయ్యింది. “యు/ఎ” సర్టిఫికేషన్ అందుకొన్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలను చేరుకోగలుగుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus