Sukumar, Rajamouli: సుకుమార్‌ జక్కన్నని ఫాలో అవుతున్నారా?

సాధారణ స్థాయి నుండి డాన్‌లా మారిన సినిమాల్లో ఓ కామన్‌ పాయింట్‌ ఉంటుంది మీరెప్పుడైనా గమనించారా. అప్పటివరకు తనవైపే నమ్మిన బంటులా ఉన్న ఒకడు సడన్‌గా అవతలి వైపు వాళ్లకు హెల్ప్‌ చేస్తాడు. దాని వల్ల సినిమా కథ మొత్తం మారిపోతుంది. అయితే అతను అలా సపోర్టు చేయడానికి వెనుక చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఫార్ములానే సుకుమార్‌ వాడుకోబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘పుష్ప’ పార్ట్‌ 2కి సంబంధించి సుకుమార్‌ ఈ ప్రయత్నాలు చేస్తున్నారట.

‘పుష్ప’ పార్ట్‌ 1లో పుష్పరాజ్‌కి నమ్మిన వ్యక్తిగా ఉంటాడు కేశవ. సినిమా మొదటి నుండి ఆఖరి వరకు కేశవ అలానే నమ్ముకొని ఉంటాడు. అయితే ఇప్పుడు పాత్రతోనే సుకుమార్‌ కథను మలుపు తిప్పుతారని టాక్‌. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేశవను కట్టప్పను చేస్తున్నారని తెలుస్తోంది. తొలి పార్ట్‌లో బ్యాలెన్స్‌గా ఉండిపోయిన విలన్స్ రెండో పార్ట్‌లో పుష్పరాజ్‌ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవీ పారకపోవడంతో ఇంటర్వెల్‌ టైమ్‌లో కేశవను తమవైపు తిప్పుకుంటారని టాక్‌. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియడం లేదు.

సుకుమార్‌ సినిమాల్లో ట్విస్ట్‌లను పట్టుకోవడం అంత సులభం కాదు. ‘వన్‌’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలు చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. ప్రతి సీన్‌లోనూ ఏదో ఒక క్లూ వదులుతూ వెళ్తాడు. ఫైనల్‌గా అసలు సీన్‌ వచ్చేసరికి వాటిని రివీల్‌ చేస్తుంటాడు. అలా ‘పుష్ప’ పార్ట్‌ 1లోనూ కొన్ని సీన్స్‌ అలా ఉంచేశాడు అంటున్నారు. పుష్పరాజ్‌ను కేశవ బాగా నమ్ముతాడని చెబుతుంటాడు. అయితే గోవిందప్ప వచ్చి ఎర్రచందనం పట్టుకునే క్రమంలో పుష్పను నమ్మకుండా పారిపోవాలని అనుకుంటాడు కేశవ.

అయితే అలాంటి సీన్స్‌ ఇంకేమీ సినిమాలో లేవు. కానీ సెకండ్‌ పార్ట్‌లో కేశవలో గ్రే షేడ్‌ చూపిస్తారని అంటున్నారు. అయితే కేశవ అలా చేయడానికి ఓ కారణం ఉంటుందని అంటున్నారు. అంటే ‘బాహుబలి’ సినిమాలో కట్టప్పలా అన్నమాట. అయితే ఆ కారణమేంటి, కేశవ అలా ఎందుకు చేశాడు, మరి దానికి పుష్పరాజ్‌ ఏం చేస్తాడు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఏదైతేనేం మరోసారి రాజమౌళిని సుకుమార్‌ ఫాలో అయ్యేలా ఉంది అంటున్నారు. చూద్దాం లెక్కల మాస్టారూ లెక్కేంటో.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus