టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ‘శ్రీమంతుడు’ సినిమాలో లానే నిజ జీవితంలో కూడా రెండు గ్రామాలను దత్తత తీసుకుని.. అక్కడి ప్రజలకు ఎంతో సాయం చేస్తున్నాడు. ఆ ఊర్లల్లో పిల్లలకు విద్య అలాగే అందరికీ వైద్యం ఫ్రీగా అందేలా చూస్తున్నాడు. ఇక ఇప్పటికే 1010 మంది చిన్నారులకు ఫ్రీగా హార్ట్ సర్జరీలు చేయించి వారి ప్రాణాలను నిలబెట్టాడు. ఇదిలా ఉండగా..నటుడు సోనూ సూద్ కూడా ఇప్పుడు ఎంతో మందికి సాయం చేస్తూ వస్తున్నాడు.
ఈ లాక్ డౌన్ టైంలో అతను చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మహేష్ బాటలోనే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వంటి నటులు కూడా కొన్ని గ్రామాలకు తమ వంతు సాయం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సుకుమార్ కూడా జాయిన్ అయినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత ఊరైన మట్టపర్రు గ్రామంలో .. ఆయన తండ్రిగారు అయిన బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు గారు పేరు మీద..
మండల ప్రజా పరిషత్ ప్రాధమిక ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు అంతస్తుల పాఠశాల భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడట. తాజాగా సుకుమార్ పెద్ద అన్నయ్య.. శ్రీ బండ్రెడ్డి వెంకటేశ్వర రావు గారు శంకుస్థాపన కూడా చేశారట. ఈ భవనం నిర్మాణం కోసం సుకుమార్ 15లక్షల వరకూ ఖర్చు పెడుతున్నాడని తెలుస్తుంది. దాంతో ఈ స్టైలిష్ డైరెక్టర్ పై ప్రశంసలు కురుస్తున్నారు నెటిజన్లు.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?