Teja,Venkatesh: వెంకటేష్ తో తేజ సినిమా లేనట్టేనా?

దర్శకుడు తేజతో సినిమాలు చేయడానికి దగ్గుబాటి ఫ్యామిలీ ఎప్పుడూ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. రానా ఆల్రెడీ తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేశాడు. అది మంచి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత రానా తమ్ముడు అభిరామ్… ‘అహింస’ అనే సినిమా చేశాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. త్వరలోనే రానాతో మరో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు తేజ. అయితే ఈ అన్నదమ్ములతో కంటే ముందే..

వీళ్ళ బాబాయ్ తో రెండు సార్లు సినిమా అనౌన్స్ చేశాడు తేజ. కానీ రెండు సార్లు సినిమాలు ఆగిపోయాయి. మరి భవిష్యత్తులో వెంకటేష్ తో తేజ సినిమా ఉంటుందా లేదా అనే ప్రశ్నకు తాజాగా తేజ సమాధానం ఇచ్చాడు. తేజ మాట్లాడుతూ.. ‘వెంకటేష్ గారితో సినిమా ఉంటుందో లేదా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నేను రేపటి గురించి ఆలోచించను. ఈరోజు ఏం చేయాలో దాని గురించి ఆలోచిస్తాను.’ అంటూ చెప్పుకొచ్చాడు.

వెంకటేష్ (Venkatesh) తో తేజ మొదట ‘సావిత్రి’ అనే సినిమాని అనౌన్స్ చేశాడు. ఆ సినిమా కథ ఏమైంది అని అడగ్గా.. ‘ఆ కథ ఎప్పుడో పోయింది’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు తేజ. అంతేకాదు తేజ – వెంకటేష్ కాంబినేషన్లో ‘ఆట నాదే వేట నాదే’ అనే టైటిల్ తో కూడా ఓ సినిమా మొదలైంది. ఆది కూడా ఆరంభంలోనే ఆగిపోయింది. ప్రస్తుతం వెంకటేష్.. దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్’ అనే సినిమా చేస్తున్నాడు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus