Director Teja: ‘రాక్షస రాజు’ ఆగిపోయింది.. దర్శకుడు తేజకి ఇదైనా కలిసొస్తుందా?

సీనియర్ స్టార్ డైరెక్టర్ తేజ (Teja) కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నాడు. రానాతో చేయాల్సిన ‘రాక్షస రాజు’ హోల్డ్ లో పడటం వల్ల కాబోలు.. కొంచెం స్లో అయ్యాడు. గత 7,8 ఏళ్లుగా చూసుకున్నా.. తేజ కెరీర్ ను గమనించినా ‘నేనే రాజు నేనే మంత్రి’ (Nene Raju Nene Mantri) తప్ప అతనికి ఇంకో హిట్టు లేదు. రానా (Rana Daggubati) తమ్ముడు అభిరామ్ తో చేసిన ‘అహింస’ (Ahimsa) అయితే పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. తేజ బ్రేక్ తీసుకోవడానికి ఇది కూడా ఓ కారణం అని చెప్పాలి.

Director Teja

దీంతో తన కొడుకుని హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు తేజ. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నాడట. కథ ఫైనల్ అయ్యింది.దానికి ‘హ‌నుమంతు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. టైటిల్ ను బట్టి ఇది మైథాలజీ టచ్ ఉన్న సినిమా అనుకోకండి. ‘హనుమాన్’ లో హ‌నుమంతుని శక్తులు హీరోకి వస్తాయి. కానీ ఈ సినిమాలో హీరోకి హనుమంతుని ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందుకే అతన్ని అంతా ‘హ‌నుమంతు’ అని పిలుస్తుంటారట.

ఇది కూడా తేజ (Director Teja) స్టయిల్లో సాగే టిపికల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. కానీ టేకింగ్ తన గత సినిమాల మాదిరి ఉండదట. అలాగే ఇందులో కామెడీ కూడా హైలెట్ అవుతుంది అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరికొద్ది రోజుల్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది.మరి ఈ చిత్రంతో అయినా తేజ హిట్టు కొట్టి మళ్ళీ ఫామ్లోకి వస్తాడేమో చూడాలి.

 ఆ ఒక్క మాటతో తమిళ మీడియా మెప్పు పొందిన తారక్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus