Poonam Kaur: మొదటిసారి డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎటాక్ చేసిన పూనమ్ కౌర్

టాలీవుడ్ లో జానీ మాస్టర్ (Jani Master) కేస్ పెను దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయమై మా అసోసిషన్ & తెలుగు ఫిలిం ఛాంబర్ కలిసి ఇవాళ ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జానీ మాస్టర్ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్నామని ప్రకటించి.. ఇకపై ఈ తరహా తప్పులు మళ్ళీ సంభవించకుండా ఉండేందుకు “హేమ కమిటీ” తరహాలోనే తెలుగు చిత్రసీమ కొరకు ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఇకపై ఈ తరహా ఉదంతాలు జరగకుండా జాగ్రత్త పడతామని కూడా వెల్లడించారు.

Poonam Kaur

అయితే ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ పేరు మీద రేగిన జ్వాలలు ఇంకా ఆరకుండానే, నటి పూనం కౌర్ కొత్త రచ్చను తెర మీదకు తీసుకువచ్చింది. గత కొంత కాలంగా ఆమె ఇండైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) & పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లను ఉద్దేశిస్తూ, వారిని అవమానించే రీతిలో మాటిమాటికీ ట్వీటులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మొట్టమొదటిసారి ఆమె డైరెక్ట్ గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ట్వీట్ వేసి సంచలనం సృష్టించింది.

సదరు ట్వీట్ లో మా అసోసియేషన్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఇచ్చిన కంప్లైంట్ ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తూ.. ఆమెను కావాలనే అసోసియేషన్ పట్టించుకోలేదని, తాను మా అసోసియేషన్ పెద్దలకు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఖాతరు చేయలేదని, ఇండస్ట్రీ పెద్దలు వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ప్రశ్నించాలని పూనం కౌర్ ట్వీట్ వేయడం దానికి సోషల్ మీడియా మొత్తం సపోర్ట్ ఇవ్వడం మొదలైపోయింది.

మొన్నటివరకు అంటే ఇండైరెక్ట్ గా పేరు లేకుండా ట్వీట్స్ వేసింది కాబట్టి ఎవ్వరు పట్టించుకోలేదు. ఈసారి డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరును ట్వీట్ చేయడంపై ఇండస్ట్రీ వర్గాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయో చూడాలి.

జానీ మాస్టర్ పైనే కాకుండా వాళ్ళపై కూడా ఫిర్యాదులు.. షాకింగ్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus