చాలా గ్యాప్ తర్వాత తేజ సూపర్ హిట్ అందుకున్నారు. రానాతో చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో డైరక్టర్ కి అనేక అవకాశాలు తలుపుతట్టాయి. ముందుగా విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. సురేశ్ ప్రొడక్షన్స్, ఎ.కె. ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ఆట నాదే వేట నాదే అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ ఆ ప్రాజక్ట్ ని పక్కన పెట్టి ఎన్టీఆర్ బయోపిక్ లోకి జాయిన్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఘనంగా ప్రారంభమయింది. తాజాగా ఈ సినిమా నుంచి కూడా తేజ బయటికివచ్చారు. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ ని ఎవరు డైరక్ట్ చేస్తారు?,
తేజ నెక్స్ట్ ఏ సినిమా చేస్తారని ప్రశ్నలు తలెత్తాయి. మొదటి ప్రశ్నకు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు అని సమాధానం లభిస్తోంది. అతను కుదరదంటే బాలకృష్ణ డైరక్ట్ చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇక రెండో ప్రశ్నకు వచ్చేసరికి కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. కొత్తవారితో లో బడ్జెట్ తో సినిమా చేస్తారని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది మాత్రం వెంకటేష్ సినిమానే చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్… అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ చిత్రం తర్వాత వెంకీ తేజకి డేట్స్ ఇస్తారా? లేకుంటే ముందే ఇస్తారా ? అనేది? మరో ప్రశ్న. ఇన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు త్వరలోనే దొరకనున్నాయి.