కమర్షియల్ సినిమాలు వేరు.. బయోపిక్ వేరు. మొదటిది జేబు నింపితే.. రెండోది సంతృప్తి నిస్తుంది. అయితే బయోపిక్ సంతృప్తితో పాటు కలక్షన్స్ ని కురిపిస్తుందని సావిత్రి బయోపిక్ మూవీ మహానటి నిరూపించింది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను కమర్షియల్ సినిమాలకు దీటుగా కలక్షన్స్ రాబడుతోంది. అందుకే తేజ బయోపిక్ తీయాలని ఫిక్స్ అయ్యారు. మొన్నటి వరకు ఇతను ఎన్టీఆర్ బయోపిక్ కోసం శ్రమించారు. కానీ కొన్ని కారణాలవల్ల బయటికి వచ్చారు. వెంకటేష్ తోనే సినిమా తీయాలని అనుకున్నారు. కానీ వెంకీ మల్టీస్టారర్ మూవీ కోసం డేట్స్ కేటాయించారు. సో తేజ తాను పరిశ్రమకి పరిచయం చేసిన ఉదయ్ కిరణ్ పై బయోపిక్ తీయాలని డిసైడ్ అయ్యారు.
ఎటువంటి సినీ నేపథ్యం లేని ఉదయ్ కిరణ్ ని తేజ చిత్రం సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు. ఆ చిత్రం సూపర్ హిట్. ఆ ఆతర్వాత నువ్వు నేను తీశారు. ఇది సంచలన విజయం సాధించింది. ఆ ఆతర్వాత ఉదయ్ కిరణ్ చేసిన మనసంతా నువ్వే బంపర్ హిట్. ఇలా హ్యాట్రిక్ హిట్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ వరుసగా అపజయాలు.. ప్రేమ విఫలం కావడం.. అవమానాలు ఉదయ్ కిరణ్ ని కుంగదీశాయి. జీవితంపై విరక్తి తో 37 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకున్నారు. అతని పతనం వెనుక మెగా ఫ్యామిలీ హస్తం ఉందని ప్రచారం కూడా సాగింది. మరి ఈ బయోపిక్ లో వాటిని ప్రస్తావిస్తారా?.. లేదా అనేది ఇప్పుడే చెప్పలేము కానీ … ఉదయ్ కిరణ్ బయోపిక్ కోసం స్క్రిప్ట్ పనులు మొదలు అయ్యానని మాత్రం చెప్పగలం. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.