డైరెక్టర్ తేజ ప్రస్తుతం అహింస సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూన్ రెండో తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తేజ తన వ్యక్తిగత విషయాలు గురించి మాత్రమే కాకుండా వృత్తిపరమైన విషయాల గురించి కూడా మాట్లాడుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమాత్రం సిగ్గులేదని ఆత్మ అభిమానం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మనకు ఆంధ్ర బ్యాంక్ అనేది ఉండేదని అయితే ప్రస్తుతం ఈ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ లోకి విలీనం చేశారని ఈయన తెలియజేశారు.ఇప్పటికీ పంజాబ్ బ్యాంక్ ఉంది కెనరా బ్యాంక్ ఉంది కానీ ఆంధ్ర బ్యాంక్ మాత్రం లేదని ఈయన గుర్తు చేశారు. ఇలా ఆంధ్ర బ్యాంకు లేకపోవడానికి కారణం ఆంధ్ర వాళ్లకు మన అనే ఫీలింగ్ లేకపోవడమే కారణమని తెలిపారు.
ఆంధ్ర బ్యాంకు ను విలీనం చేస్తే చేయని మాకేంటి ఇబ్బంది అన్న ధోరణిలో ఆంధ్ర ప్రజలు ఉన్నారని ఎవరు కూడా ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర ప్రజల హక్కు అని బ్యాంకు విలీనం చేయడానికి అడ్డుకోలేదని తేజ తెలిపారు. అందుకే ఆంధ్రులకు ఏమాత్రం సిగ్గు లేదని మాట్లాడుతున్నాను అంటూ తేజ వెల్లడించారు. తెలుగు నేలపై సుమారు 97 సంవత్సరాల పాటు సేవలందించిన ఆంధ్ర బ్యాంక్‌ని.. మూడేళ్ల క్రితం అనగా 2020 ఏప్రిల్ 1 తేదీన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు.
ఆంధ్ర బ్యాంకును స్వాతంత్ర సమరయోధుడు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో స్థాపించారు. 1980 ఇందిరాగాంధీ హయామంలోఈ బ్యాంక్ జాతీయ బ్యాంక్ గా అవతరించిందని అయితే ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించిన ఆంధ్ర బ్యాంకు ను 2020వ సంవత్సరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారని (Director Teja) తేజ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆంధ్ర ప్రజల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు