Director Teja: కూతురు పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన తేజ!

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి వారిలో తేజ ఒకరు. ఎంతో అద్భుతమైన ప్రేమ కథ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో తేజకు ఎవరు సాటి రారని చెప్పాలి. ఇక ఈయన ఏ విషయం గురించి మాట్లాడిన చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలవారు. ఇలా తన వ్యాఖ్యల ద్వారా ఎప్పటికప్పుడు తేజ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇకపోతే చాలా రోజుల తర్వాత తేజ అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాని జూన్ రెండవ తేదీ విడుదల చేయనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తేజ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తేజ ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు సినీ ఎంట్రీ గురించి మాట్లాడారు.

ఇప్పటికే తాను శిక్షణ పూర్తి చేసుకుని వచ్చారని త్వరలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలియజేశారు. ఇక తన కుమార్తె గురించి కూడా తేజ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ… తన కుమార్తెకు తాను పెళ్లి చేయనని తెలియజేశారు.ఆమె కూడా విదేశాలలో చదువు పూర్తి చేసుకుని వచ్చిందని తేజ తెలిపారు. అయితే తనకు నచ్చిన వాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని రమ్మని చెప్పాను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు తెలిపారు.

ఇక తనకు ఆ వ్యక్తి నచ్చకపోతే నిర్మొహమాటంగా విడాకులు కూడా తీసుకోమని (Director Teja) తన కూతురికి చెప్పానని ఈ సందర్భంగా తేజ తన కుమార్తె పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మనం సంతోషంగా బ్రతకడమే ముఖ్యం జనాలు ఏమనుకుంటున్నారో అనేది అనవసరం అంటూ తేజ పిల్లలకు చెప్పినట్లు వెల్లడించారు. ఏది ఏమైనా కూతురు పెళ్లి గురించి ఇంత భిన్నంగా ఆలోచించే తండ్రి బహుశా మరెవరు ఉండరేమో అంటూ ఈయన వ్యాఖ్యలపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus