రాణా సినిమా కోసం కాజలే కథానాయిక అని ఫిక్స్, వద్దంటున్న టీం మేట్స్

Advertisement

ఒక కాంబినేషన్ లో సినిమా అద్భుతంగా వర్కవుట్ అయ్యి.. బాగా కలిసొచ్చిందంటే సదరు కాంబినేషన్ ఒకటికి రెండు సార్లు రిపీట్ అయినా ఎవరూ పట్టించుకోరు. కానీ.. ఒక ఫ్లాప్ కాంబినేషన్ వద్దన్నా రిపీట్ అవుతుంది అంటే మాత్రం అది కచ్చితంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతుంది. ప్రస్తుతం తేజ-కాజల్ కాంబినేషన్ అలాగే మారింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికీ మూడు సినిమాలు రాగా.. వాటిలో “నేనే రాజు నేనే మంత్రి” ఒక్కటే హిట్. మిగతా రెండు సినిమాలు “లక్ష్మీ కళ్యాణం, సీత” డిజాస్టర్లుగా నిలిచాయి. అయినప్పటికీ.. తేజ మాత్రం తన తాజా చిత్రంలో హీరోయిన్ గా మళ్ళీ కాజలే కావాలి అని పట్టుబడుతున్నాడట.

“సీత” డిజాస్టర్ అనంతరం “ఆర్టికల్ 370” ఆధారంగా ఒక సినిమా తీద్దామని బాలీవుడ్ వెళ్ళి.. అది సెట్ అవ్వక మళ్ళీ టాలీవుడ్ వచ్చేసిన తేజ “రాక్షసరాజు రావణాసురుడు, అలుమేలు మంగ” అనే రెండు టైటిల్స్ ను మొన్న తన పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేశాడు. వీటిలో ఒక సినిమాలో రాణా, గోపీచంద్ కీలకపాత్రలు పోషించనుండగా.. హీరోయిన్ గా కాజల్ కావాలని తేజ ఫిక్స్ అయ్యాడు. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతూ.. చేతిలో సరైన ఆఫర్లు లేకపోయినా కాజల్ మాత్రం ఇప్పటికీ రెండు కోట్ల దాకా చార్జ్ చేస్తోంది. సమంత స్థాయిలో థియేటర్లకు రప్పించగలిగే స్టార్ డమ్ అమ్మడికి లేకపోయినా ఇలా భారీ మొత్తం రెమ్యూనరేషన్ గా తీసుకోవడం మాత్రం మానడం లేదు. దాంతో నిర్మాతలు మరియు తేజ టీం కాజల్ వద్దని వారిస్తున్నప్పటికీ.. తేజ మనసు మారడం లేదట.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus