దర్శకుడు పేట త్రికోటి (Trikoti Peta) అందరికీ సుపరిచితమే. గతంలో ఇతను నాగ శౌర్యతో (Naga Shaurya) ‘దిక్కులు చూడకు రామయ్య’ (Dikkulu Choodaku Ramayya) అనే సినిమా తీశాడు. అది బాగానే ఆడింది. ఆ తర్వాత ‘జువ్వ’ అనే సినిమా కూడా చేశారు. అయితే దర్శకుడిగా ఇతను గ్యాప్ తీసుకున్నారు. గురువు రాజమౌళి (S. S. Rajamouli) తెరకెక్కించే సినిమాలకి అసిస్టెంట్ గా పనిచేస్తూ ఎక్కువగా గడిపారు.’మగధీర’ (Magadheera) ‘బాహుబలి'(సిరీస్) (Baahubali), ‘ఆర్.ఆర్.ఆర్’, (RRR)వంటి సినిమాలకి కో- డైరెక్టర్ గా పనిచేశారు త్రికోటి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరోసారి డైరెక్టర్ గా మారి ‘అహో విక్రమార్క’ (Aho Vikramaarka) అనే సినిమా చేశారు.
‘మగధీర’ విలన్ దేవ్ గిల్ (Dev Gill) ఈ చిత్రంలో హీరోగా నటించాడు. అంతేకాదు ఈ ప్రాజెక్టుని తన సతీమణితో కలిసి ‘దేవ్ గిల్ ప్రొడక్షన్స్’ పై నిర్మించారు. ఆగస్టు 30 న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఈ క్రమంలో ‘ ‘అహో విక్రమార్క’ రిజల్ట్ తో సంబంధం లేకుండా.. ఇక నుండి నాన్ స్టాప్ గా సినిమాలు డైరెక్ట్ చేస్తారా? లేక మీ గురువు రాజమౌళి.. మహేష్ (Mahesh Babu) తో చేస్తున్న చిత్రం కోసం పని చేస్తారా?’ అనే ప్రశ్న త్రికోటికి ఎదురైంది.
దీనికి ఆయన బదులిస్తూ.. ” రాజమౌళి- మహేష్..ల సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. కంప్లీట్ అయ్యేసరికి 3 ఏళ్ళు పట్టే ఛాన్స్ ఉంది. అయితే ఆ ప్రాజెక్టు కోసం వచ్చేయమని రాజమౌళి గారు నన్ను ఒత్తిడి చేయలేదు. సో నాకు ఇష్టమైతే ఆ ప్రాజెక్టులో భాగం అవుతాను. లేదు అంటే డైరెక్టర్ గా వేరే సినిమా చేసుకుంటాను. అది పూర్తిగా నా ఛాయిస్” అంటూ చెప్పుకొచ్చాడు త్రికోటి.
త్రికోటి మాటలను బట్టి.. మహేష్- రాజమౌళి సినిమా షూటింగ్ మొదలవ్వడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ఇక సెట్స్ పైకి వెళ్ళాక.. కంప్లీట్ అవ్వడానికి ఇంకో 3 ఏళ్ళు పడుతుందని కూడా చెప్పకనే చెప్పాడు త్రికోటి. అయితే కథ, కథనాలు గురించి బయటపెట్టడానికి అతను ఇష్టపడలేదు.