పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) , అమలాపాల్ (Amala Paul) జంటగా నటించిన ‘ది గోట్ లైఫ్: ఆడుజీవితం’ (The Goat Life) సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా మళయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. బ్లెస్సి (Blessy) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బెన్యామీన్ రచించిన నవల ఆధారంగా రూపొందింది.కేరళకు చెందిన నజీబ్ మహమ్మద్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఆ నవల, ‘ది గోట్ లైఫ్’ సినిమా రూపొందింది.
సౌదీలో ఏదో ఒక పని చేసుకుని బాగా సంపాదించుకుని..తిరిగి ఇండియా వచ్చి సెటిల్ అవుదామనుకునే వాళ్ళని అక్కడి అధికారులు ఎలా మోసం చేస్తున్నారు. వాళ్ళని ఎడారిలోకి తీసుకెళ్లి.. ఎంత ఘోరంగా చాకిరి చేయిస్తున్నారు…అనే థీమ్ తో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో అకేఫ్ నజీమ్ అనే వ్యక్తి ఓ చిన్న పాత్ర పోషించాడు. హీరో ఎడారిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. చివరికి ఓ రోడ్ మీదకి వస్తే.. అతని వేషధారణ చూసి ఎవ్వరూ కార్ ఆపి సాయం చేయడానికి ఇష్టపడరు.
అలాంటి టైంలో ఓ ధనవంతుడు అయినటువంటి(అకేఫ్ నజీమ్) కార్లో వచ్చి హీరోని ఎక్కించుకుని.. అతనికి మంచినీళ్లు కూడా పట్టించి.. ఓ చోట దించి వెళ్ళిపోతాడు. ఈ పాత్ర మంచిదే అయినప్పటికీ.. అతనికి సంతృప్తి నివ్వలేదు అన్నట్టు ఇటీవల పేర్కొన్నాడు. తన పాత్ర పూర్తిగా హీరోకి సాయం చేయదు అనో ఏమో కానీ,, కొంత విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఈ సినిమాకి సైన్ చేసే ముందు స్క్రిప్ట్ పూర్తిగా చదవలేదట అకేఫ్ నజీమ్.