వెంకటేష్ 75వ సినిమా కోసం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

ఇండస్ట్రీలో ఏ హీరో అభిమాని అయినా కూడా వెంకటేష్ ను మాత్రం ఎవరూ హేట్ చేయలేరు. ఒకరకంగా చెప్పాలంటే అందరి హీరోల అభిమానులు మాత్రమే కాదు అందరు హీరోలూ ఆయన అభిమానులే. అందుకే వెంకటేష్ సినిమా ఫ్లాప్ అయితే ఎవరూ ఆయన గురించి తక్కువగా మాట్లాడరు. ఇక రీసెంట్ గా “ఎఫ్ 2″తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఒకేసారి 50 క్రోర్స్ మరియు 100 క్రోర్స్ క్లబ్ లో స్థానం సంపాదించుకొన్న వెంకీ ప్రస్తుతం “వెంకీ మామ” సినిమా కోసం రెడీ అవుతున్నాడు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగచైతన్య మరో కథానాయకుడిగా నటించనుండగా.. రకుల్ ప్రీత్ సింగ్, శ్రియ కథానాయికలుగా నటించనున్నారు.

ఈ సినిమా తర్వాత వెంకీ 75వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్-వెంకీల కాంబినేషన్ లో ఇదివరకూ వచ్చిన “మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్”ల తరహాలోనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మరో సినిమా తెరకెక్కించి వెంకీ మైలురాయి సినిమా అయిన 75వ చిత్రాన్ని స్పెషల్ ఫిలిమ్ గా చరిత్రలో నిలిచిపోయేలా చేయాలన్నది త్రివిక్రమ్ ప్లాన్. అందుకోసమే ఈ చిత్రంలో ఇద్దరుముగ్గురు యువ హీరోలను కూడా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. త్రివిక్రమ్ అడిగితే కాదనే హీరో ఎవరున్నారు. అందులోనూ వెంకీతోపాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే అందరు హీరోలకు ఇష్టమే. మరి ఆ ముగ్గురు యువ కథానాయకులు ఎవరనేది తెలియడానికి కాస్త టైమ్ పడుతుంది కానీ.. త్రివిక్రమ్ ప్లాన్ ప్రకారం ఈ 75వ సినిమా గనుక వర్కవుట్ అయితే తప్పకుండా ప్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకొనే సినిమాగా మిగిలిపోవడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus