మహేష్ 25 వ మూవీ కథపై వస్తున్న రూమర్లను ఖండించిన డైరక్టర్

  • March 10, 2018 / 07:29 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh 25th Movie) చేస్తున్న “భరత్ అనే నేను” సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. మిగిలిన ఒక పాటను, కొన్ని సన్నివేశాలను ఈ నెలలో కంప్లీట్ చేయనున్నారు. వచ్చే నెల 20 న సినిమా రిలీజ్ కానుంది. దీని తర్వాత మహేష్ రెస్ట్ తీసుకోకుండా తన 25 వ సినిమా షూటింగ్ ని ప్రారంభించనున్నారు. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి అన్ని పనులు పూర్తి అయ్యాయి. అమెరికా నేపథ్యములో సాగే ఈ చిత్రం గురించి ఓ రూమర్ కొంతకాలంగా ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.

ఆ విషయాన్నీ ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా వంశీని అడిగారు. “న్యూజిలాండ్ రైటర్ ఆస్ట్రేలియా సిరీస్ కోసం రాసిన కథను ఆధారం చేసుకొని మీరు మహేష్ కథ రెడీ చేసారని విన్నాను. ఇది నిజమేనా ” అని అడగగా వంశీ స్పందించారు. “అది నిజం కాదు. మహేష్ కోసం రాసుకున్న కథ ఏ సిరీస్ కి, చిత్రానికి స్ఫూర్తి కాదు.” అని వెల్లడించారు. ఇలా రూమర్ కి చెక్ పెట్టారు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత. ప్రతి తెలుగు సినిమా ఏదో ఇంగ్లిష్ సినిమాకి కాపీ అని ప్రచారం చేయడం ఫ్యాషన్ అయిపోయిందని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus