డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన మొట్టమొదటి తెలుగు చిత్రం సార్.సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు తమిళ భాషలలో విడుదల చేశారు. ఈ సినిమా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఫిబ్రవరి 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా విద్యార్థులను వారి తల్లిదండ్రులను చాలా ఎమోషనల్ గా ఆకట్టుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడటానికి ఇష్టపడటమే కాకుండా ఈ సినిమాకు మంచి రివ్యూ అందిస్తున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందం శనివారం సాయంత్రం హైదరాబాదులో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ వెంకీ అట్లూరి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ మాట్లాడుతూ మనసున్న ప్రతి మనిషికి సార్ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందని ఈయన తెలిపారు. చదువు అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసరం. అందుకే సార్ సినిమా బ్యాక్‌డ్రాప్ 1990 అయినప్పటికీ ఇప్పటి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారనిపించింది.ఇక మా నిర్మాత నాగ వంశీ ఈ సినిమా కథను ధనుష్ గారికి చెప్పమని చెప్పినప్పుడు తాను చాలా సంతోషంగా ఫీల్ అయ్యానని వెంకీ తెలిపారు.
ఇక ధనుష్ గారిని కలిసి ఈ సినిమా కథ తెలిపినప్పుడు ఆయన కథ వినగానే క్లాప్స్ కొడుతూ కాల్ షీట్స్ ఎప్పుడు ఇవ్వమంటారు అనడంతో తనకు చాలా సంతోషం వేసిందని డైరెక్టర్ వెల్లడించారు.ఇందులో తండ్రీ కొడుకుల మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ వస్తాయని అయితే ఈ సన్నివేశం త్రివిక్రమ్ గారితో సంభాషించిన తర్వాతే ఈ సన్నివేశాన్ని పెట్టామని తెలిపారు.ఇక ఎంతో అద్భుతమైన ఈ సినిమా ఇంతటితోనే ముగుస్తుందని ఈ సినిమాకు ఎలాంటి సీక్వెల్స్ ఉండవని అలాంటి ఆలోచన కూడా తనకు లేదని వెంకీ తెలిపారు.ఇక తన దర్శకత్వంలో వచ్చే సినిమాలు అన్నీ కూడా ఎంతో వైవిద్య భరితంగా ఉంటాయని ఈయన తెలియజేశారు.