నితిన్ (Nithiin) ఇంకా యాభై కోట్లు, వంద కోట్లు క్లబ్లో ఎందుకు చేరలేదు.. ఈ ప్రశ్న చాలా మందిలో ఉండే ఉంటుంది. అందులో యాంకర్ కూడా ఉన్నాడు. అతని ‘రాబిన్ హుడ్’ (Robinhood) దర్శకుడు, నితిన్ స్నేహితుడు అయినటువంటి వెంకీ కుడుములని (Venky Kudumula) డైరెక్ట్ గా ఈ విషయం పై ప్రశ్నించాడు. ఆ యాంకర్.. ‘నితిన్ తో పాటు చాలా మంది హీరోలు కెరీర్ స్టార్ట్ చేశారు. ఆయన తర్వాత కూడా చాలా మంది హీరోలు వచ్చారు. వాళ్లలో చాలా మంది హీరోలు రూ.50 కోట్లు, రూ.100 కోట్లు క్లబ్లో ఈజీగా చేరిపోయారు.
నితిన్ కి ఆ రేంజ్ ఉన్నప్పటికీ.. ఎందుకు ఇంకా ఆ మార్క్ ను అచీవ్ చేయలేకపోతున్నారు?’ అంటూ దర్శకుడు వెంకీ కుడుములని ప్రశ్నించాడు. అందుకు అతను మాట్లాడుతూ.. ” నిజంగానే నితిన్ గారికి రూ.50 కోట్లు, రూ.100 కోట్లు క్లబ్లో చేరే కెపాసిటీ ఉంది. కానీ మధ్యలో సినిమాలు వర్కౌట్ కాలేదు. కథ బాగున్నా… దాన్ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది.
తర్వాత ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకునే విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత కథ బాగున్నా.. మిగిలిన ఫాక్టర్స్ వర్కౌట్ అవ్వకపోతే ఏదీ జరగదు. ముఖ్యంగా నితిన్ గారికి ఉన్న ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే.. ఒక హిట్టు కొట్టగానే తర్వాత 3 ప్లాపులు పడుతుంటాయి. మేము పర్సనల్ గా కూడా అదే మాట్లాడుకుంటాం. అయితే నితిన్ గారి లైఫ్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే దాదాపు 12 ఏళ్ళ పాటు ఆయనకు హిట్టు లేదు.
అలాంటి టైంలో పెద్ద దర్శకులు ఆయన ఎదురుపడితే.. మొహం తిప్పుకుని వెళ్లిపోయేవారట. ఆ విషయం నితిన్ అన్న నా దగ్గర చెప్పుకున్నారు. చాలా బాధ అనిపించింది. ఫైనల్ గా ఫ్యామిలీ అతనికి అండగా నిలబడింది. ‘ఇష్క్’ తో కంబ్యాక్ ఇచ్చారు. ఉన్న డబ్బులన్నీ ఆ సినిమా కోసం పెట్టేసి మరీ నితిన్ కోసం అతని ఫ్యామిలీ నిలబడింది” అంటూ వెంకీ కుడుముల (Venky Kudumula) చెప్పుకొచ్చాడు.