జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి వెట్రిమారన్ అలా అన్నారా?

  • March 11, 2023 / 02:26 PM IST

జూనియర్ ఎన్టీఆర్ వెట్రిమారన్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఎన్టీఆర్, ధనుష్ కాంబినేషన్ లో వెట్రిమారన్ డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ అంటూ వచ్చిన వార్తల గురించి స్పష్టత రావాలని అభిమానులు కోరుకుంటున్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. తారక్ అభిమానుల ఆశలను వెట్రిమారన్ గల్లంతు చేశారు.

తన భవిష్యత్తు ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ ఇచ్చిన ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ తో తను సినిమా చేయడం లేదని చెప్పకనే చెప్పేశారు. విదుతలై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెట్రిమారన్ మాట్లాడుతూ రెండు భాగాలుగా రూపొందుతున్న విదుతలై సినిమాను పూర్తి చేయడంపై మాత్రమే తన దృష్టి ఉందని అన్నారు. విదుతలై మూవీ పూర్తైన వెంటనే సూర్యతో మూవీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సూర్యతో సినిమాను పూర్తి చేసిన తర్వాత వడా చెన్నై2 సినిమా పనులతో బిజీ కానున్నానని ఆయన కామెంట్లు చేశారు.

ఈ ప్రాజెక్ట్ ల గురించి తప్ప మరే ప్రాజెక్ట్ గురించి వెట్రిమారన్ మాట్లాడలేదు. మరో మూడు నుంచి నాలుగేళ్ల వరకు వెట్రిమారన్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారని అందువల్ల ఎన్టీఆర్ వెట్రిమారన్ కాంబోలో సినిమా అసాధ్యమని తేలిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల గురించి మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుండగా త్వరలో ఎన్టీఆర్30 టైటిల్ ను కూడా ప్రకటించనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ జాన్వీ జోడీకి మంచి రెస్పాన్స్ వస్తుండగా ఈ జోడీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని కొంతమంది చెబుతున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తారక్ జాన్వీ జోడీ మరిన్ని సినిమాల్లో కలిసి నటించే అవకాశంతో పాటు జాన్వీ కపూర్ తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus