Vetrimaaran: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు వెట్రిమారన్ చెప్పిన శుభవార్త ఇదే!

  • September 21, 2024 / 02:11 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  దేవర (Devara) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran)  తో పని చేయాలని ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. అవసరమైతే సినిమాను తమిళంలో తెరకెక్కించి తెలుగులో డబ్ చేద్దామని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. తారక్ వెట్రిమారన్ తో సినిమా చేయాలని భావిస్తున్నారని ఆయన కామెంట్ల ద్వారా తారక్ అభిమానులకు సైతం అర్థమైంది. వైరల్ అయిన వార్తలు తన దృష్టికి రావడంతో వెట్రిమారన్ ఈ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Vetrimaaran

జూనియర్ ఎన్టీఆర్ తో కచ్చితంగా సినిమా చేస్తానని వెట్రిమారన్ తెలిపారు. గతంలోనే తారక్ తో సినిమా చేయాలని భావించినా ఇద్దరం కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో సాధ్యం కాలేదని ఆయన వెల్లడించారు. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన వెంటనే తారక్ తో సినిమా చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి వెట్రిమారన్ ఆసక్తి చూపడంతో ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

వెట్రిమారన్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం విడుతలై పార్ట్2 సినిమాతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మరో నాలుగేళ్ల పాటు కెరీర్ పరంగా గ్యాప్ రాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ను ప్లాన్ చేసుకోవడం కొసమెరుపు. జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ పెరుగుతున్నా పరిమితంగానే పారితోషికం అందుకుంటున్నారు.

దేవర సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్న తారక్ తర్వాత సినిమాలకు ఎంత పారితోషికం అందుకుంటారో చూడాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మూవీ షూట్ లో తారక్ 2025 జనవరి నుంచి పాల్గొననున్నారని తెలుస్తోంది.

సత్య సీరియల్లో కూడా నటించాడా.. వీడియో వైరల్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus