సినిమాలు – మనోభావాలు… ఈ కాంబినేషన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ, ఎంత చర్చించుకున్నా తేలని విషయాలే. ఎందుకంటే సినిమాల్లో చూపించినవి సమాజం నుండి తీసుకున్నవే అంటారు సినిమా జనాలు. కాదు కాదు సినిమాల్లో చూపించినవి చూసి జనాలు అలా చేస్తున్నారు అని అంటారు మనోభావాల ప్రముఖులు. తాజాగా ఇదే చర్చల క్రమంలోకి ‘అన్నపూరణి’ సినిమా వచ్చింది. అందులో చూపించిన సన్నివేశాలను ఎవరూ సమర్థించరు. అలా అని జరగలేదా అంటే లేదు అని చెప్పలేని పరిస్థితి.
ఈ చర్చ జరుగుతుండగానే ‘అన్నపూరణి’ సినిమాను నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ఆ పని చేశారు అని సమాచారం. అయితే ఇలా చేయడం సరికాదు అని ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ అభిప్రాయపడ్డారు. సెన్సార్ టీమ్ సర్టిఫై చేసిన సినిమాను ఇలా ఎలా తీసేస్తారు అనేది ఆయన మాట. నయనతార 75వ సినిమాగా ‘అన్నపూరణి’ వచ్చింది. ఈ సినిమా కెరీర్‌లో మైలురాయిలా ఉంటుందని భావించారంతా. అలా జరగకపోగా ఇప్పుడు వివాదాలమయమైంది.
ఓ వర్గానికి చెందిన ప్రజల మత విశ్వాసాల్ని ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కించపరిచేలా ఉన్నాయనేది కొన్ని సంఘాలు వాదన. కొన్ని పోలీస్ స్టేషన్లలో నయనతారపై కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు నిరసనలు పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ తలనొప్పి భరించలేక సినిమాను నెట్ ఫ్లిక్స్ తొలగించింది. అయితే తమిళ దర్శకులు, రచయితలు, నిర్మాతలు సినిమాకు మద్దతుగా పెద్దగా మాట్లాడటం లేదు. కానీ దర్శకుడు వెట్రిమారన్ గళం విప్పారు. ‘అన్నపూరణి’ సినిమాను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.
‘అన్నపూరణి’ (Annapoorani) చిత్రాన్ని ఓటీటీ నుండి తొలగించడం ఆరోగ్యకరమైన పరిణామం కాదు. సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇస్తూ, ప్రదర్శనకు అనుమతి ఇచ్చినప్పుడు దాన్ని ఏ మీడియంలో అయినా ఎలా అడ్డుకుంటారు. ఇది సినిమాని మాత్రమే కాదని, సెన్సార్ బోర్డు అధికారాన్ని అడ్డుకున్నట్టే అని వెట్రిమారన్ కామెంట్ చేశారు. ఈ విషయంలో చిత్రసీమ ఏకం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అయితే ఈ విషయంలో నయనతార ఇప్పటివరకు స్పందించలేదు.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!