విక్రమ్ తో అఖిల్!
- August 10, 2016 / 04:39 AM ISTByFilmy Focus
అఖిల్ రెండవ సినిమా విషయంలో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. రీసెంట్ గానే హనురాఘవపూడి డైరెక్షన్ లో సినిమా ఉంటుందని అఖిల్ ట్వీట్ చేయడంతో అక్కినేని అభిమానులు హమ్మయ్యా.. అనుకున్నారు. అయితే ఇప్పుడు అఖిల్ డైరెక్టర్ మారాడంటూ.. మరో వార్త వినిపిస్తుంది. అఖిల్, హనుల సినిమా కొన్ని కారణాల వలన పక్కన పెట్టేశారట.
దాంతో విక్రమ్ కుమార్ ను లైన్ లోకి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై గతంలో విక్రమ్ ‘మనం’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో అఖిల్ చిన్న రోల్ లో కనిపించాడు. అఖిల్ ను విక్రమ్ తెరపై చూపించిన తీరు నచ్చడంతో ఆయనతోనే సినిమా చేయాలాని భావిస్తున్నట్లు టాక్. విక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఏ వార్తల్లో ఎంత వరకు నిజముందో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















