లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలంటే చాలా ధైర్యం కావాలా? అవుననే అంటుంటారు మన వెటరన్ నాయికలు. సినిమా భారం మొత్తం తన మీదే వేసుకొని ముందుకు నడవడం అంటే అంత ఈజీ కాదు అనేది గతంలో ఒకరిద్దరు నోట విన్నాం. నిన్నటి తరం నాయికలు కావొచ్చు, గత తరం నాయికలు కావొచ్చు ఇదే మాట అంటున్నారు. అయితే రెండు సినిమాల అనుభవం ఉన్న కథానాయిక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది అంటే సాహసమే కదా.
అలాంటి పనే చేస్తోంది మన బేబమ్మ. అవును కృతి శెట్టి కొత్త ప్రాజెక్టు ఇదే అంటున్నారు. ‘ఉప్పెన’తో టాలీవుడ్ కెరీర్ ప్రారంభించిన కృతి శెట్టి రెండో సినిమాగా ‘శ్యామ్ సింగరాయ్’ చేసింది. ఇప్పుడు మూడో సినిమాగా ‘బంగార్రాజు’ విడుదలవుతోంది. ఇవి కాకుండా మరో మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అలా మొత్తం ఆరు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఏడో సినిమా కూడా ఓకే అయ్యిందంటున్నారు. ఆ సినిమానే లేడీ ఓరియెంటెడ్ మూవీ అని టాక్.
‘ఉయ్యాలా జంపాలా’, ‘మజ్ను’తో తనదైన గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ ఈ సినిమాకు దర్శకుడు అంట. అంతేకాదు మెగాస్టార్ డాటర్ సుస్మిత కొణిదెల ఈ సినిమాకు నిర్మాత అంట. అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే ఏ జీవిత కథనో లేక పోలీసు కథో అనుకోవద్దు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ తరం అమ్మాయి జీవితాన్ని ఈ సినిమాలో చూపిస్తా అంటున్నారు విరించి వర్మ. అందుకు కృతి శెట్టి అయితే బాగుంటుందని విరించి అనుకున్నారట.
దీంతో ఆమెను సంప్రదించి కథ ఓకే చేసుకున్నారని తెలుస్తోంది. త్వరలో సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని సమాచారం. ఇక కృతి లైనప్ చూసుకుంటే… సంక్రాంతికి వచ్చే ‘బంగార్రాజు’ కాకుండా సుధీర్‌బాబు ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’, రామ్ – లింగుస్వామి సినిమా, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ఉన్నాయి. ఈ మూడూ పార్లల్‌గా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. వీటితోపాటే ఇప్పుడు విరించి వర్మ సినిమా కూడా ఉంటుందని సమాచారం.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!