ఈరోజు ‘ఖలేజా’ చిత్రం విడుదలయ్యి 10ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఆ చిత్రం ట్యాగ్ లైన్ అయిన ‘దైవం మనుష్య రూపేణ’ అనే పదం అందరి నోటా నానుతుంది. అయితే ఆ పదానికి నిలువెత్తు నిదర్శనం మాత్రం మన సోనూ సూద్ అనే చెప్పాలి. సినిమాల్లో అతను ఒక భయంకరమైన విలన్. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు కలిగి చాలా గంభీరంగా కనిపిస్తుంటాడు. అయితే నిజజీవితంలో మాత్రం అతను హీరో అనిపించుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఎంతో మంది వలస కూలీలు తమ గమ్యస్థలాలకి చేరుకోలేక అవస్థ పడుతుంటే వారిని ఆదుకున్నాడు.
వారి ఆకలి తీర్చాడు. వారి కుటంబాల దగ్గరకు పంపే ఏర్పాట్లు చేశాడు. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం ఫేస్ చేస్తున్న కష్టాన్ని తెలుసుకుని వారికి ఉచితంగా ట్రాక్టర్ పంపించాడు.అక్కడితో ఆగలేదు ఎటువంటి సాయం అయినా చేస్తాను అంటూ ఓ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చేసాడు. అందుకే అతని క్రేజ్ ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది. అతన్ని విలన్ అంటే జనాలు కొట్టేలా ఉన్నారు. మొన్నటికి మొన్న అతను నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్లో తిరిగి పాల్గొనడానికి వస్తే.. యూనిట్ సభ్యులు చప్పట్లు కొడుతూ వెల్కమ్ చెప్పిన సందర్భాన్ని మనం చూసాము.
అంతేకాదు అతన్ని సత్కరించారు కూడా..! అయితే ఇప్పుడు అతని క్రేజ్ ను వాడుకోవాలని దర్శకనిర్మాతలు బలంగా ఫిక్సయిపోయారని ఇన్సైడ్ టాక్.ప్రస్తుతం అతను నటిస్తున్న సినిమాల్లో.. అతని క్యారెక్టర్ లెంగ్త్ పెంచుతున్నారట. అతని కోసం మరికొంత మంది దర్శకులు కథలో మార్పులు కూడా చేస్తున్నారట. అంతేకాదు టీజర్లోనూ, ట్రైలర్లోనూ సోనూ కనబడేలా చూసుకుంటున్నారట. వినడానికే విడ్డూరంగా ఉంది కదూ..!
Most Recommended Video
కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!