Tollywood: యంగ్ హీరో భాగోతం..ఆ దర్శకులందరూ బాధితులే

బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళకు అవకాశాలు రావడమే చాలా ఎక్కువ. అవకాశాలు వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడం ఇంకా కష్టం. ఇలాంటి టైంలో విజయాలను తలకెక్కించుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది.

Tollywood Young Hero

టాలీవుడ్‌..లో ఓ యంగ్ హీరో వ్యవహారం హాట్ టాపిక్‌ గా మారింది. వరుస ప్లాపులతో సతమతమైన ఈ హీరో, ఈ ఏడాది ఆరంభంలో ఒక డీసెంట్ హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, ఆ సక్సెస్ ఇచ్చిన ధైర్యమో ఏమో గానీ, ఇప్పుడు పలువురు యువ దర్శకులకు చుక్కలు చూపిస్తున్నాడట. కథలు వినడం, నెలల తరబడి నాన్చడం, చివరికి హ్యాండివ్వడం వంటి పనులతో వారి సహనాన్ని పరీక్షిస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఈ హీరో వల్ల ఓ డెబ్యూ డైరెక్టర్ ఏకంగా 2 ఏళ్ళ విలువైన సమయాన్ని కోల్పోయాడని తెలుస్తోంది. పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో తనతో సినిమా చేస్తాడని ఆశతో ఆ కొత్త దర్శకుడు అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నాడు. 2 ఏళ్ళ పాటు ఆ హీరో చుట్టూ తిరిగి, కథపై కసరత్తులు చేశాడు. తీరా సమయం వచ్చిన తర్వాత, ‘ఈ సినిమా చేయడానికి నేను ఇంకా సిద్ధంగా లేను’ అని చెప్పి సైడ్ అయిపోయాడట. దీంతో ఆ డెబ్యూ డైరెక్టర్ చేసేదేమీ లేక మరో హీరోను వెతుక్కునే పనిలో పడ్డాడు.

 

మరోపక్క ఇంతకుముందు ఒక మెమరబుల్ హిట్ ఇచ్చిన ఓ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా ఈ హీరో కోసం ఏడాదికి పైగా ఎదురుచూస్తున్నాడట. ఈ యంగ్ హీరో ఆ దర్శకుడి కథను పూర్తిగా తిరస్కరించకుండా, అలాగే అంగీకరించకుండా మధ్యలోనే వేలాడదీస్తున్నాడని తెలుస్తుంది. పలుమార్లు మార్పులు సూచిస్తూ, సమయాన్ని వృధా చేస్తున్నాడని, దీంతో ఆ డైరెక్టర్ తీవ్ర నిరాశలో ఉన్నాడని సమాచారం.ఈ హీరో ప్రవర్తనతో విసిగిపోయిన బాధితులంతా ఇటీవల సమావేశమయ్యారట. ఆ దర్శకులందరూ ఇలా ఏకమై తన గురించి చర్చించుకున్నారని తెలియడంతో ఆ యంగ్ హీరో షాక్‌కు గురయ్యాడట. ఇప్పటికైనా ఈ హీరో తన వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులో మంచి కథలు, దర్శకులు దొరకడం కష్టమవ్వొచ్చని ఇండస్ట్రీ జనాలు అభిప్రాయపడుతున్నారు.

ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus