ఒక సినిమాని డైరక్టర్ చేయడం అంటే ప్రతిభతో పాటు అనుభవం ఉండాలి. కానీ నేటి యువకులు అనుభవంతో అవసరం లేదు.. మంచి ఐడియా ఉంటే చాలని నిరూపిస్తున్నారు. తొలి సినిమాతోనే సూపర్ సక్సస్ అందుకుంటున్నారు. అటువంటి యువ దర్శకులపై ఫోకస్…
సందీప్ రెడ్డి (అర్జున్ రెడ్డి )పాతికేళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ తొలి సినిమా శివ తో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఇప్పుడు సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి తో అంతటి పేరు దక్కించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని మూస ధోరణిలను బ్రేక్ చేసి బోల్డ్ గా విజయాన్ని అందుకున్నారు.
సంకల్ప్ రెడ్డి (ఘాజీ)1971లో జరిగిన ఇండో-పాక్ వార్ లోని కీలక అంశాన్ని సంకల్ప్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. అత్యంత క్లిష్టమైన ఈ సంఘటనను సంకల్ప్ రెడ్డి కళ్ళకు కట్టి ఫస్ట్ స్టెప్ తో హిట్ కొట్టారు.
శివ నిర్వాణ (నిన్ను కోరి)టాలీవుడ్ లో ప్రేమ కథ చిత్రాలకు కొరత ఏమి లేదు. అయినా శివ నిర్వాణ నిన్ను కోరి సినిమాలో కొత్తగా ప్రేమ కథను చెప్పారు. యువతను ఆకట్టుకున్నారు.
కృష్ణ మరిముత్తు (యుద్ధం శరణం)యువ దర్శకుడు కృష్ణ మరిముత్తు తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాని ఇంటెన్స్ థ్రిల్లర్ గా యుద్ధం శరణం చిత్రాన్ని మలిచారు. సూపర్ టేకింగ్ తో సక్సస్ సొంతం చేసుకున్నాడు.
ఆనంద్ రవి (నెపోలియన్)టీజర్, ట్రయిలర్ తో నెపోలియన్ సినిమా అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ చిత్ర డైరక్టర్ కి ఇదే మొదటి సినిమా. అతనే ఆనంద్ రవి. రచయితగా పరిచయం ఉన్న ఇతను తొలి సారి మెగా ఫోన్ అందుకున్నారు. త్వరలో మొదటి సినిమాతో సూపర్ సక్సస్ సాధించిన దర్శకుల జాబితాలో చేరిపోతాడని సినీ విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు.
అజయ్ ఆండ్రూస్ (ఒక్కడు మిగిలాడు)మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ భారీ కథను అజయ్ ఆండ్రూస్ ఎంచుకొని శెభాష్ అనిపించుకున్నారు. ఇక కథని ఎలా వెండితెరపై ఆవిష్కరించారో కొన్ని రోజుల్లో తెలియనుంది.
వివేక్ ఆత్రేయ (మెంటల్ మదిలో)వివేక్ ఆత్రేయ తొలిసారి మెగా ఫోన్ చేపట్టి రూపొందించిన ‘మెంటల్ మదిలో’ కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. విభిన్నమైన టైటిల్ తో ఈ మూవీ ఆకర్షిస్తోంది.
ఉపేంద్ర (ఎమ్ఎల్ఏ)ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మంచి లక్షణాలున్న అబ్బాయిగా నటిస్తున్న సినిమా ఎమ్ఎల్ఏ. ఈ సినిమాతో శ్రీను వైట్ల దగ్గర రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనేక సినిమాలకు పని చేసిన ఉపేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఎంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.