వెండితెరపైన హీరోయిన్స్ నటన, అందాన్ని చూసినప్పుడు చాలామంది వారి ప్రేమలో పడిపోతుంటారు. ప్రేక్షకుడికి కథానాయికకు దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరిమధ్య ప్రేమ ఆరాధనగానే ఉండిపోతుంది. మరి డైరక్టర్ తో హీరోయిన్ సినిమా చిత్రీకరణ జరుగుతున్నసేపు టచ్ లో ఉంటారు. సన్నివేశం కోసం మాట్లాడుకుంటారు.. షూటింగ్ గ్యాప్ లో కబుర్లు చెప్పుకుంటారు. ఆ సమయంలో కొంతమంది మధ్య ప్రేమ చిగురించి పెళ్లి దాకా తీసుకెళ్లింది. అలా దక్షిణాది సినీ పరిశ్రమలో ఆలుమగలు అయిన డైరక్టర్స్, హీరోయిన్స్ పై ఫోకస్..
కృష్ణవంశీ, రమ్యకృష్ణ క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ గులాబీ ఇవ్వకుండా .. గులాబీ చిత్రం ద్వారా రమ్యకృష్ణను ప్రేమలో పడేసారు. పెళ్ళికి ముందు రమ్యకృష్ణ, కృష్ణవంశీ దర్శకత్వంలో నటించకపోయినప్పటికీ ఇద్దరూ తరచూ కలుసుకొని కబుర్లు చెప్పుకోవడం ద్వారా దగ్గరయ్యారు. భార్యాభర్తలయ్యారు.
సెల్వమణి, రోజా రోజా సినిమాల్లో హీరోయిన్ గా మంచి ఫామ్లో ఉన్న సమయంలో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న సెల్వమణితో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమ గా మారి పెళ్లి వరకు వెళ్లింది. 2002 లో పెళ్లిచేసుకున్న వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు.
మణిరత్నం, సుహాసిని ప్రేమ కథ చిత్రాలను కావ్యాలుగా తెరకెక్కించే మణిరత్నం నిజజీవితంలోనూ మధురమైన ప్రేమ కథను నడిపారు. టాలీవుడ్ టాప్ యాక్ట్రస్ లో ఒకరైన సుహాసినిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 1988 సంవత్సరం మొదట్లో డైరక్టర్, హీరోయిన్ గా పరిచయమైనా వీరిద్దరూ.. అదే ఏడాది చివరికి ఆలుమగలయ్యారు.
సూర్యకిరణ్, కళ్యాణి మలయాళ నటి కళ్యాణి అనేక మలయాళ సినిమాల్లో నటించి టాలీవుడ్ లోకి ప్రవేశించారు. కేరళలో పుట్టి చెన్నైలో సెటిల్ అయిన డైరక్టర్ సూర్యకిరణ్ ని పెదబాబు సినిమా షూటింగ్ లొకేషన్లో కలిశారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ స్టోరీ పెళ్లి పీటలవరకు వెళ్లింది.
సుందర్, కుష్బూ దక్షిణాది సినీపరిశ్రమలో హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించిన కుష్బూ, తమిళ డైరక్టర్ సుందర్. సి. బాబుని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇద్దరూ సినీ రంగంలో కొనసాగుతున్నారు.
భాగ్యరాజ్, పూర్ణిమ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కి మొదట ప్రవీణ అనే ఆమెతో పెళ్లి అయింది. ఆమె చనిపోవడంతో నటి పూర్ణిమను పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరూ “డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్” సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. అప్పుడే ప్రేమలో పడి జీవిత భాగ్యస్వాములయ్యారు.
సురేష్ మీనన్, రేవతితమిళ డైరక్టర్ సురేష్ మీనన్, కేరళ నటి రేవతిలది కూడా ప్రేమ వివాహమే. 1986 లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న వీరు పదహారేళ్లు కలిసి జీవించిన తర్వాత విడాకులు తీసుకున్నారు.
సెల్వ రాఘవన్, సోనియా అగర్వాల్ 7 /జి బృందావన్ కాలనీని సెల్వ రాఘవన్ డైరక్ట్ చేయగా, అందులో సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడం, పెళ్లి దాకా వెళ్లిపోవడం జరిగిపోయింది. అయితే వీరి ప్రేమ ఎక్కువకాలం నిలువలేదు. రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు.
విజయ్, అమలాపాల్ దైవ తిరుముగల్ (నాన్న) సినిమా సమయంలో విజయ్, అమల పాల్ కి మధ్య ప్రేమ మొదలయింది. 2014 లో పెళ్లిచేసుకున్నారు. రెండేళ్లపాటు కూడా సజావుగా సంసారం చేయకుండా కోర్టుకెళ్లి 2016 లో విడాకులు తీసుకున్నారు.
విగ్నేష్ శివన్, నయన తార ఇద్దరితో ప్రేమలో పడి పెళ్లి దాకా వెళ్లి సింగల్ అయిన హీరోయిన్ నయనతార. ప్రస్తుతం ఈమె డైరక్టర్ విగ్నేష్ తో కలిసి జీవిస్తోంది. విగ్నేష్ దర్శకత్వంలో నయనతార “నాను రౌడీ దాన” అనే మూవీలో నటించింది. అందులో నటనకు గాను అనేక అవార్డులు అందుకుంది. బోనస్ గా డైరక్టర్ ప్రేమను దక్కించుకుంది.