లింగుస్వామి టు మోహన్ రాజా.. పక్క రాష్ట్రాల హీరోలకు ప్లాపులిచ్చిన దర్శకులు..!

  • November 3, 2022 / 09:35 AM IST

‘బాహుబలి'(సిరీస్) ‘కె.జి.ఎఫ్'(సిరీస్) లు సూపర్ హిట్లు అయిన తర్వాత ఇది ప్రాంతీయ చిత్రం అనే ముద్ర చెరిగిపోయింది. అందుకే ఓ రాష్ట్రానికి చెందిన దర్శకులు మరో రాష్ట్రానికి వెళ్లి మరీ సినిమా తీస్తున్నారు. ఈ పద్ధతి ‘బాహుబలి’ ‘కె.జి.ఎఫ్’ ల కంటే ముందే ఉంది. కానీ ఆ సినిమాలు సక్సెస్ అవ్వడంతో మరింతగా పెరిగింది. అయితే పక్క భాషలో క్రేజ్ ఉన్న హీరోతో సినిమా తీస్తే అది బ్లాక్ బస్టర్ అయిపోద్ది అని దర్శకులు భావించడం అనేది అతిశయోక్తి అయితే.. పక్క రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకులతో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ కొట్టేయొచ్చు అని హీరోలు అనుకోవడం అంతకు మించిన అతిశయోక్తి అవుతుంది. ఇందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అలా పక్క రాష్ట్రాల హీరోలతో సినిమాలు చేసి ప్లాపులిచ్చిన దర్శకుల లిస్ట్ ను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

1) లింగుస్వామి :

ఈ కోలీవుడ్ డైరెక్టర్ టాలీవుడ్ హీరో రామ్ తో ‘ది వారియర్’ అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందింది. సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

2) శైలేష్ కొలను :

ఈ టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ తో ‘హిట్’ చిత్రాన్ని రీమేక్ చేశాడు. ఇది అక్కడి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

3) పుష్కర్ గాయత్రి :

ఈ తమిళ డైరెక్టర్ ‘విక్రమ్ వేద’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని తీసుకెళ్లి హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లతో రీమేక్ చేసింది. ఈ మూవీ పెద్ద ప్లాప్ అయ్యింది.

4) గౌతమ్ తిన్ననూరి :

ఈ టాలీవుడ్ డైరెక్టర్ ‘జెర్సీ’ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ తో రీమేక్ చేశాడు. ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

5) మోహన్ రాజా :

ఈ తమిళ దర్శకుడు చిరంజీవితో ‘లూసిఫర్’ చిత్రాన్ని రీమేక్ చేశాడు. కానీ ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేక ప్లాప్ అయ్యింది.

6) అనుదీప్ :

ఈ టాలీవుడ్ డైరెక్టర్ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ‘ప్రిన్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి అతనికి ప్లాప్ ఇచ్చాడు.

7) మురుగదాస్ :

ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ తో సినిమా చేసి పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు.

8) గౌతమ్ వాసుదేవ్ మీనన్ :

నాగ చైతన్య కి ‘సాహసం శ్వాసగా సాగిపో’ , నానికి ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ వంటి ప్లాప్ లు ఇచ్చాడు ఈ తమిళ దర్శకుడు.

9) సి.ప్రేమ్ కుమార్ :

తమిళంలో ’96’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసి.. అదే చిత్రాన్ని తెలుగులో శర్వానంద్ తో రీమేక్ చేసి పెద్ద ప్లాప్ ఇచ్చాడు.

10) తిరు :

ఈ తమిళ దర్శకుడు గోపీచంద్ తో ‘చాణక్య’ అనే చిత్రాన్ని తెరకెక్కించి పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus