పెద్ద స్టార్స్ కి కథ రాసే ఛాన్స్ వస్తే ఏ దర్శకుడు మాత్రం వదులుకుంటాడు. అలాంటి అవకాశాన్ని కావాలనే వదులుకున్నాడు దర్శకుడు మారుతి. మహేష్ బావ సుధీర్ బాబుని హీరోగా పెట్టి మారుతి తీసిన ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమా అప్పట్లో సెన్సేషన్ అయింది. ఆ సమయంలో మహేష్ ఇంప్రెస్ అయిన మారుతికి చెక్ ఇప్పించి కథ రాయమని చెప్పాడట. ఈ విషయాన్ని మారుతి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
అయితే మహేష్ అడ్వాన్స్ ఇచ్చినా కూడా మారుతి మాత్రం కథ రాయలేదట. దానికి కారణం మహేష్ స్థాయి స్టార్ హీరోతో సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవని.. అంత భారాన్ని మోయగల సమర్ధత తనకు ఉందా అనే సందేహంతో కథ రాయలేదని మారుతి తెలిపారు. బన్నీ కూడా తనతో సినిమా చేయమని అడిగాడని.. అయితే అలాంటి స్టార్ హీరోలతో సినిమా చేస్తే మాములుగా ఉండదకూడదని.. ఒకప్పడు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదని.. కానీ ఇప్పుడు వచ్చిందని మారుతి తెలిపారు. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో ముప్పై మంది ఆర్టిస్ లను పెట్టుకొని సినిమా చేశానని.. బాగానే మేనేజ్ చేసినట్లు.. ఇప్పుడో భారీ సినిమాని డీల్ చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పారు.