Prabhas: ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్!

  • May 10, 2022 / 11:00 PM IST

స్టార్ హీరో ప్రభాస్ కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలలో నటించడానికి ఇతర భాషల నటీనటులు సైతం ఆసక్తి చూపుతున్నారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ గత సినిమాలు సాహో, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కె అంచనాలను మించి విజయాలను అందుకుంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ సినిమాకు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కళ్లు చెదిరే ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

అయితే తాజాగా హీరోయిన్ దిశా పఠానీ హీరో ప్రభాస్ నన్ను చెడగొడుతున్నాడంటూ షాకింగ్ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. స్టార్ హీరో ప్రభాస్ భోజన ప్రియుడు కాగా ఆయన సినిమాలో నటించే హీరోయిన్ ఎవరైనా ప్రభాస్ తెప్పించే వంటకాలను తప్పనిసరిగా రుచి చూడాల్సిందేనని చెప్పవచ్చు. ప్రభాస్ ఇంటినుంచి వచ్చిన క్యారేజ్ ను తిని ఆ వంటకాలకు సంబంధించిన విశేషాలను చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దిశా పటానీ ప్రాజెక్ట్ కె షూటింగ్ కు హాజరై ప్రభాస్ వంటకాలను టేస్ట్ చేసి “థాంక్యూ ప్రభాస్..

మమ్మల్ని చెడగొట్టినందుకు” అని కామెంట్ చేశారు. సాధారణంగా హీరోయిన్లు ఫిట్ గా ఉండాలని వంటకాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ప్రాజెక్ట్ కె సినిమా తెరకెక్కుతుంది. అశ్వనీదత్ ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే సైతం ప్రభాస్ విందు గురించి గతంలో పాజిటివ్ కామెంట్లు చేశారు.

మరోవైపు ఈ ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు విడుదలవుతాయని ఫ్యాన్స్ భావించినా రాధేశ్యామ్ మాత్రమే విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదల కానుండగా సలార్ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. సలార్ షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus