Divi, Mahesh Babu: మహేష్ తో బాండింగ్ ఏర్పడిందన్న దివి!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు సూపర్ స్టార్ మహేష్ బాబుకు అభిమానులనే సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. మహేష్ హీరోగా నటిస్తున్న సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా మహేష్ బాబు భవిష్యత్తు ప్రాజెక్టులు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కుతుండటం గమనార్హం. బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి కూడా మహేష్ కు వీరాభిమాని కావడం గమనార్హం.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాలో దివి చిన్న రోల్ లో కనిపించారు. తాజాగా దివి మహర్షి సినిమా షూటింగ్ అనుభవాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మహేష్ బాబును చూసి తాను సిగ్గుపడిపోయానని దివి తెలిపారు. మహర్షి సినిమా దివికి తొలి సినిమా కాగా సెట్ లో మహేష్ బాబు చాలా అందంగా కనిపించారని దివి అన్నారు. తొలి సినిమాలోనే మహేష్ బాబుతో పని చేశానని దివి కామెంట్లు చేశారు.

అమ్మాయిలం ఒకవైపు కూర్చుని ఉన్నామని మహేష్ బాబు మా ముందునుంచి వెళ్లగా ఎంత బాగున్నాడో అని అనుకున్నామని దివి వెల్లడించారు. నాకు తెలియకుండానే మహేష్ తో బాండింగ్ ఏర్పడిందని కెరీర్ మహేష్ సినిమాతో మొదలైంది కాబట్టి తనకు ఆ ఫీలింగ్ కలిగిందని దివి వెల్లడించారు. మహేష్ బాబు హెయిర్ స్టైల్ కానీ స్కిన్ టోన్ కానీ మరో లెవెల్ లో ఉంటాయని దివి అన్నారు.

మహర్షి సినిమాలో తాను ఐదు సీన్లలో నటించానని అయితే ఆ సీన్లలో చాలా సీన్లు ఎడిటింగ్ లో కట్ చేశారని దివి కామెంట్లు చేశారు. మహేష్ బాబుతో ఒక ఫ్రేమ్ లో కనిపించినా ఒక బిట్ లో కనిపించినా చాలని దివి వెల్లడించారు. మహేష్ గురించి దివి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న దివికి తెలుగు సినిమాలలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ షో దివి కెరీర్ కు ఉపయోగపడిందనే చెప్పాలి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus