బిగ్‌బాస్‌ ఇంటి నుంచి దివి ఔట్‌.. అసలు కారణాలు ఏంటి..?

బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం దివి ఎలిమినేషన్ అనేది కొంతమందికి అన్ ఫెయిర్ గా అనిపించినా, ఓటింగ్ ప్రకారమే దివి ని ఎలిమినేషన్ జరిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు దివి హౌస్ లో ఏం చేసింది.? ఎందుకు దివి ఎలిమినేట్ అవ్వకూడదు అని కూడా బిగ్ బాస్ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ వీక్ లో హౌస్ మేట్స్ అందరి మనస్తత్వాలు కాచి వడబోసింది తప్పితే, తన గేమ్ ఏంటి అనేది ఆలోచించలేకపోయింది దివి. అంతేకాదు, ఎవరు ఏ విషయంలో వారి ప్రవర్తనని మార్చుకోవాలి అనేది మార్నింగ్ మస్తీలో చెప్పినపుడు దివికి బయట ఫాన్ ఫాలోయింగ్ పెరిగింది. కానీ సిల్లీ రీజన్స్ చెప్తూ హౌస్ మేట్స్ ని నామినేట్ చేసినపుడు అది పోయింది.

ఇంకో రీజన్ ఏంటంటే., హౌస్ మేట్స్ అందరితో కంటే అమ్మతోనే ఎక్కువగా ఉంది దివి. అంతేకాదు, అమ్మగేమ్ ని కూడా చాలాసార్లు ఇన్ఫులెన్స్ చేసింది కూడా. ఇక తనని లాస్ట్ వీక్ నామినేట్ చేసిన లాస్య కోసం తను శాక్రిఫైజ్ చేసి మరీ నామినేషన్స్ లోకి వచ్చింది. ఇది ఆడియన్స్ కి నచ్చుతుందిలే అని లైట్ తీస్కుంది. కానీ, ఆడియన్స్ కూడా ఓట్లు వేయడంలో లైట్ తీస్కుంటారని గెస్ చేయలేకపోయింది. ఇక హౌస్ మేట్స్ గురించి అనవసరంగా మాట్లాడిన మాటలు కూడా దివికి మైనస్ అయ్యాయి. మోనాల్ – అభిజిత్ – అఖిల్ విషయంలో మాట్లాడినవి, అలాగే మిగతా హౌస్ మేట్స్ గురించి అమ్మదగ్గర చెప్పినమాటలు ఇవన్నీ కూడా దివికి మైనస్ అయ్యాయనే చెప్పాలి.

ఇక తనని తాను నామినేట్ చేస్కున్నప్పుడు వేరే వాళ్లు ఎవరూ కూడా దివికి సపోర్ట్ చేయలేదు. అంతేకాదు, టాస్క్ లలో కూడా దివికి పెర్ఫామ్ చేసే స్కోప్ అనేది ఎక్కడా కూడా రాలేదు. వచ్చిన అవకాశాలని కూడా సద్వినియోగ పరుచుకోలేకపోయిందనే చెప్పాలి. అందుకే ఆడియన్స్ హ్యూజ్ గా ఓటింగ్ వేయలేకపోయారు. అరియానికి ఈవారం వచ్చిన క్రేజ్ లో 10శాతం వచ్చినా సేఫ్ అయ్యేది. అంతేకాదు, అఖిల్ ఫ్యాన్స్ అందరూ మోనాల్ కి ఓటింగ్ వేయడం వల్ల దివికి మైనస్ అయ్యిందని కూడా చెప్పొచ్చు. అదీ మేటర్.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus