Silaka Mukku Dana Song: ఫోక్ సాంగ్ లో మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ!

  • July 3, 2021 / 01:50 PM IST

ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో ఎక్కువగా స్పెషల్ వీడియోలను, సాంగ్స్ ను విడుదల చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో చాలా మంది యూట్యూబ్ మీద పడ్డారు. ఇప్పుడు అలాంటి ఓ స్పెషల్ వీడియో సాంగ్ లో మెరిసింది బిగ్ బాస్ బ్యూటీ దివి. గతేడాది బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె తన అందంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ఎక్కువరోజులు హౌస్ లో కంటిన్యూ అవ్వలేకపోయింది.

కానీ ఆమెకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. రీసెంట్ గా ఈమె నటించిన ఒక సినిమా ఓటీటీలో విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈమె ఓ వీడియో సాంగ్ లో కనిపించారు. తెలంగాణ ఫోక్ మ్యూజిక్ ఆధారంగా రూపొందించిన ‘సిలకా ముక్కుదాన’ అనే పాటలో దివి తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు.

పాట మొత్తానికి కూడా ఆయన కొరియోగ్రఫీ హైలైట్ గా నిలిచింది. అలానే దివిని తన కెమెరాతో ఎంతో అందంగా చూపించారు మంత్ర శివ. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను హారిక నారాయణ్ ఆలపించారు. ఎస్.కె.మదీన్ మ్యూజిక్ అందించిన ఈ ప్రైవేట్ ఆల్బమ్ ను జ్యోతి కున్నూరు నిర్మించారు. తమడా మీడియా ద్వారా ఈ పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.


విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus