ఇంతకుముందు సినిమా చూసినవాడెవడైనా “సినిమా బాలేదురా” అని చెబితే.. అతడి స్నేహితులను మొదలుకొని ఇంటి చుట్టుపక్కలవారు కూడా సదరు సినిమా థియేటర్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కానీ.. ఈమధ్య “బాలేదు” అని కాదు కాదా.. “చూడవద్దు” అని చెప్పినా కూడా వినడం లేదు.
ఈ విషయాన్ని ఇటీవల విడుదలైన “సర్దార్ గబ్బర్ సింగ్” మరియు “సరైనోడు” సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. విడుదలైన మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ.. సదరు టాక్ సినిమా కలెక్షన్స్ పై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేదు.
“సర్దార్ గబ్బర్ సింగ్” తోలి రోజు ముప్పై కోట్లకు పైగా వసూలు చేయగా.. “సరైనోడు” 22 కోట్లు కొల్లగొట్టి “నెగిటివ్ టాక్ మాకు పట్టదు” అని చెప్పకనే చెప్పారు!