‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఊహించని ట్విస్టులతో రసవత్తరంగా సాగుతుంది. ఎవరు హౌస్ లో ఉంటారో? ఎవరు ఎలిమినేట్ అవుతారో అంచనా వేయలేని విధంగా ఉంటుంది పరిస్థితి. 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ లో దివ్య మిడ్ వీక్ ఎంట్రీ ఇచ్చింది.తర్వాత మరో 6 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అటు తర్వాత ప్రియా శెట్టి, శ్రష్టి వర్మ, రమ్య మోక్ష, హరిత హరీష్, మర్యాద మనీష్, ఫ్లోరా సైనీ, శ్రీజ వంటి వారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది.
స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భరణి ఎలిమినేట్ అయినా మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు 8వ వారం ఎవరు హౌస్ ను వీడుతారు అనేది చర్చనీయాంశం అయ్యింది. ఈ వారం నామినేషన్స్ లో మాధురి, తనూజ, సంజనా, రీతూ చౌదరీ, గౌరవ్, కళ్యాణ్, పవన్, రాము రాథోడ్ వంటి వారు ఉన్నారు.
వీరిలో ఓటింగ్స్ పరంగా చూసుకుంటే… తనూజ, సంజనా, రీతూ చౌదరీ,కళ్యాణ్, పవన్, రాము రాథోడ్ వంటి వారు సేఫ్ జోన్లో ఉన్నారట. అయితే గౌరవ్, మాధురి లీస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరిలో చివరికి మాధురి కొన్ని ఓట్లతో వెనకబడినట్టు స్పష్టమవుతుంది. అందువల్ల ఆమెనే ఎలిమినేట్ అయినట్లు సమాచారం. శనివారం జరిగిన ఎపిసోడ్లో మాధురి బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది.
మొదట్లో ఈమె చాలా ఆరొగెంట్ గా బిహేవ్ చేసింది. అందువల్ల హోస్ట్ నాగార్జున ఓ రేంజ్లో క్లాస్ పీకారు. తర్వాత సెట్ అయ్యింది. గేమ్ బాగానే ఆడుతుంది. కానీ ఫస్ట్ ఒపీనియన్ ఈజ్ బెస్ట్ ఒపీనియన్ అంటారు కదా. అలా చూసుకుంటే.. ఆడియన్స్ మనసులో ఎక్కడో మాధురి పై నెగిటివిటీ ఉంది అని ఓటింగ్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు.