బిగ్ బాస్ హౌస్ లో దీపావళి సంబరాలు దుమ్మురేపాయి. పటాకా జోడీలని ముందుగానే సెలక్ట్ చేసి ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం అంటూ హౌస్ట్ నాగార్జున వారితో రకరకాల గేమ్స్ ఆడించారు. మద్యమద్యలో వచ్చిన సెలబ్రిటీలో వారితో ఫుల్ ఫన్ చేశారు. హౌస్ లోకి వచ్చి న సుమ తనదైన స్టైల్లో పంచ్ లు వేస్తూ హౌస్ మేట్స్ కి హింట్స్ ఇచ్చింది. అనీమాస్టర్, పింకీ, రవి, సిరి, షణ్ముక్, శ్రీరామ్ ఇలా అందరికీ చురకలు వేస్తూ తమ గేమ్ ఎలా ఉందో చెప్పకనే చెప్పేసింది.
ఇక తర్వాత హౌస్ లోకి వచ్చిన సెలబ్రిటీలు హౌస్ మేట్స్ ఆడిన గేమ్స్ కి జడ్జిలుగా నిలిచారు. విజయ్ దేవరకొండ , బ్రదర్ ఆనంద్ దేవరకొండలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. డైరెక్టర్ మారుతి , హీరోయిన్ మెహరీన్, హీరో సంతోష్ స్టేజ్ పైన హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ మంచి కిక్ ఇచ్చారు. ఇక బాబాబాస్కర్, ముక్కు అవినాష్ లో హౌస్ లోకి వెళ్లి గ్లాస్ డోర్ దగ్గర ఫన్ చేశారు. ముక్కు అవినాష్ తనదైన స్టైల్లో కామెడీ చేస్తూ అందర్నీ బాగా నవ్వించాడు.
హీరోయిన్ అవికాగోర్, ఎక్స్ హౌస్ మేట్స్ దివి వైద్య, మోనాల్ డ్యాన్స్ పెర్ఫామన్స్ తో కిక్ ఇస్తే, హీరోయిన్ శ్రీయాశరణ్ మోజ్ గేమ్ కి జడ్జిగా వ్యవహరించింది. ఇందులో భాగంగా బాగా డ్యాన్స్ చేసిన వారికి ఫారిన్ ట్రిప్ వెళ్లే టిక్కెట్ ని ఇచ్చింది. ఇక్కడే అనీమాస్టర్ శ్రీరామ్ చంద్ర, సిరి షణ్ముక్ లు బాగా డ్యాన్స్ చేసినా కూడా , అద్భుతంగా పోల్ డ్యాన్స్ చేసిన రవికి ఈ ఛాన్స్ దక్కింది. జెస్సీని పోల్ గా పెట్టుకుని తన ఎక్స్ ప్రెషన్స్ తోనే పోల్ డ్యాన్స్ చేస్తూ పిచ్చెక్కించాడు రవి.
ఇలా పటాక జోడీలతో గేమ్స్ ఆడిస్తూనే హౌస్ లో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు హోస్ట్ నాగార్జున. లాస్ట్ లో లీస్ట్ లో ఉన్న లోబోని ఎలిమినేట్ చేశాడు. ఇక లోబో జెర్నీ చూస్తుంటే ఇన్ని రోజులు లోబో చేసిన ఎంటర్ టైన్మెంట్ అనేది ప్రేక్షకులకి ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. ఏది ఏమైనా దీపావళి సంబరాలతో బిగ్ బాస్ హౌస్ హోరెత్తిపోయిందనే చెప్పాలి. దసరా కంటే కూడా దీపావళి ఎపిసోడ్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.