సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డిజె టిల్లు’. ‘ఫార్చూన్ ఫోర్ సినిమాస్’ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా… డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. విడుదల చేసిన టీజర్, ప్రోమోలు, పాటలకి మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రం పై యూత్ లో భారీ క్రేజ్ నెలకొంది. ఓ విధంగా విజయ్ దేవరకొండ సినిమాకి ఎలాంటి హైప్ ఉంటుందో ఆ రేంజ్ హైప్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. అందుకు తగ్గట్టే టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
ఫస్ట్ డే కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం | 1.57 cr |
సీడెడ్ | 0.46 cr |
ఉత్తరాంధ్ర | 0.25 cr |
ఈస్ట్ | 0.17 cr |
వెస్ట్ | 0.32 cr |
గుంటూరు | 0.15 cr |
కృష్ణా | 0.11 cr |
నెల్లూరు | 0.10 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.13 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.25 cr |
ఓవర్సీస్ | 0.90 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.25 cr |
‘డిజె టిల్లు’ చిత్రానికి రూ.8.98 కోట్ల బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.9.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.4.92 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆదివారం రోజున బుకింగ్స్ చూస్తుంటే నిన్నటికి మించి ఉన్నాయి. అంచనాలను మించితే ఈ చిత్రం ఈరోజే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓ పక్క రవితేజ వంటి పెద్ద హీరో సినిమా ఖిలాడి పోటీగా ఉన్నప్పటికీ డిజె టిల్లు ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!