Krithi Shetty: ఈసారి హిట్‌ కొట్టకపోతే.. కష్టమే బేబమ్మా

సినిమా పరిశ్రమలో ఫేమ్‌ ఎప్పుడు, ఎలా వస్తుందో, ఎలా పోతుందో ఎవరూ చెప్పలేం. విజయాల జోరు కంటిన్యూ అయితే, అవకాశాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఒకవేళ ఫ్లాప్‌ వాసన వచ్చిందా ఆ నటుడిని / నటిని పక్కన పెట్టేస్తారు. గతంలో చాలామంది విషయంలో ఇలానే జరిగింది. వరుస విజయాలు ఇచ్చి ఫ్లాప్‌లు తగిలాక మళ్లీ కనిపించని వాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఫ్లాప్‌ కాన్సెప్ట్‌ ఎందుకు అనుకుంటున్నారా?

మేం చెప్పబోతోంది వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బేబమ్మా అలియాస్‌ కృతి శెట్టి గురించి కాబట్టి. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. బేబమ్మగా కృతిని చూసి కుర్రకారు మైమరచిపోయారు. అంత క్యూట్‌గా, కొన్నిసార్లు హాట్‌గా అదరొగొట్టేసింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. అనుకున్నట్లే ‘శ్యామ్‌ సింగ రాయ్‌’, ‘బంగార్రాజు’ అంటూ మంచి విజయాలు కూడా అందుకుంది. అక్కడి నుండి ఆమె పరిస్థితి తేడా కొట్టేసింది.

రామ్‌ ‘వారియర్‌’, నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయాయి. దీంతో బేబమ్మ మ్యాజిక్‌ తగ్గుతోంది అనే మాటలు వినిపించాయి. దీంతో 16న రానున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా మీదే దృష్టి పడింది. ‘ఆ అమ్మాయి గురించి..’ విజయం ఇప్పుడు బేబమ్మకు చాలా అవసరం. లేదంటే తర్వాత అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటున్నారు పరిశీలకులు.

ఎందుకంటే తొలి సినిమా తర్వాత సుమారు ఆరు అవకాశాలు పట్టేసింది. ఆ తర్వాత రాక తగ్గింది. ఇప్పుడు ఈ సినిమా కూడా పోతే అవకాశాలు కష్టమవుతాయి. కాబట్టి కృతికి ‘ఆ అమ్మాయి గురిచి మీకు చెప్పాలి’ చాలా కీలకం అని అంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత వేరే సినిమాలు లేవా అంటే ఉన్నాయి. కానీ ఇప్పుడు హ్యాట్రిక్‌ ఫ్లాప్‌ వస్తే ఆమె కెరీర్‌కు నష్టం. కృతి చేతిలో ఇప్పుడు వెంకట్‌ ప్రభు – నాగచైతన్య సినిమా ఉంది. దాంతోపాటు తమిళంలో సూర్యతో ‘వానంగాన్‌’ అనే సినిమాలో నటిస్తోంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus