Sunitha: సునీత కన్నా తన భర్త రామ్ వయసులో ఎంత పెద్దనో తెలుసా?

  • May 11, 2023 / 04:48 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత 2021వ సంవత్సరంలో రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈమె మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని రెండవ వివాహం చేసుకున్నారు. ఈ విధంగా సునీత రెండవ వివాహం చేసుకోబోతున్నారని తెలియగానే పెద్ద ఎత్తున సునీత చేసుకోబోయే వ్యక్తి ఎవరు ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇక సునీత భర్త ఎవరు అనే విషయం మాత్రమే కాకుండా ఈయన వయసు ఎంత అనే విషయాల గురించి కూడా ఆరా తీశారు. ఇలా సునీత రామ్ వీరపనేని వివాహం ఎంతో ఘనంగా జరిగింది. వీరి వివాహ సమయంలో కొందరు సునీత పట్ల ఎన్నో విమర్శలు కూడా చేశారు. ఇలా ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోని సునీత ముందడుగు వేశారు. ఈ విధంగా రెండవ వివాహం చేసుకున్నటువంటి ఈమె తన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

మ్యాంగో మీడియా అధినేతగా డిజిటల్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ వీరపనేని భారీగా ఆస్తులు కూడా సంపాదించారని తెలుస్తోంది. ఇక మ్యాంగో మీడియాకు ఎన్నో అద్భుతమైన పాటలను పాడినటువంటి సునీతతో రామ్ కి పరిచయం ఏర్పడింది. ఇలా ఏర్పడిన పరిచయం పెళ్లి బంధం వైపు అడుగులు వేసింది.ఇక తాజాగా రామ్, సునీత వయసు గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామ్ వీరపనేని వయసు 47 ఏళ్ళు. ఈయన మే 26, 1974న జన్మించాడు. (Sunitha) సునీత వయసు 42 ఏళ్ళు. ఈ ఇద్దరి వయసులో కేవలం ఐదేళ్లు మాత్రమే గ్యాప్ ఉంది. ఇలా ముందు నుంచి వీరిద్దరూ స్నేహితులు కావడంతో ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus