Rashmika: రష్మిక కట్టుకున్న ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా?

రష్మిక మందన్న తాజాగా తన అసిస్టెంట్ పెళ్లి వేడుకలలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. హైదరాబాదులో జరిగిన తన అసిస్టెంట్ పెళ్లి వేడుకలలో భాగంగా ఈమె ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇలా ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా రష్మిక ఆరెంజ్ కలర్ శారీ ధరించే చాలా స్టైలిష్ గా కనిపించారు.

ఈసారి చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ ఈ చీరలో మాత్రం రష్మిక చాలా అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ చీరలోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ చీర ప్రముఖ డిజైనర్ అనితా డుంగ్రి డిజైన్ చేశారు. ఈ చీర ఖరీదు ఏకంగా 35 వేల రూపాయలు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నటువంటి ఈ చీర ఖరీదు ఏకంగా 35వేల రూపాయలు అనే విషయం తెలిసి నేటిజన్స్ ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు.

అయితే సెలబ్రిటీలు ఇలా ఖరీదైన బ్రాండెడ్ డిజైనర్ దుస్తులను ధరించడం సర్వసాధారణమే. అయితే తాజాగా ఈ చీర గురించి రష్మిక మరొక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ చీర తనకు ఒక స్పెషల్ అండ్ లవ్లీ పర్సన్ కానుకగా ఇచ్చారు అంటూ ఈమె తెలియజేశారు. మరి రష్మికకు ఈ చీరను కానుకగా ఇచ్చిన ఆ స్పెషల్ పర్సన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే (Rashmika) రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఈ చీరను తన అమ్మగారు తనకు కానుకగా ఇచ్చారట.

ఇలా తన పుట్టినరోజు సందర్భంగా తన తల్లి తనకు ఈ చీర కానుకగా ఇవ్వడంతో ఎంతో ఇష్టంగా ఈ చీరను తన వద్ద ఉంచుకున్నానని ఇక ఈ పెళ్లి వేడుకలకు ఈ చీర ధరించాను అంటూ స్వయంగా రష్మిక ఈ విషయాన్ని తెలియజేశారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus