అక్కినేని హీరో అఖిల్ తాజాగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో తెరకెక్కించారు. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇలా అఖిల్ కెరియర్ లో ఈ సినిమా ఎంతో కీలకంగా మారినప్పటికీ ఈ సినిమా కూడా అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోయింది.
అఖిల్ హీరోగా వచ్చినప్పటినుంచి ఆయన నటించిన సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే పరవాలేదు అనిపించింది. మిగిలిన నాలుగు సినిమాలు కూడా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇలా ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఇందులోని స్పెషల్ సాంగ్ మాత్రం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి. అఖిల్ నటి ఊర్వశి రౌతేల కలిసి నటించిన వైల్డ్ సాల అంటూ సాగే ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పాలి.
ఈ సినిమా ఈ పాట మాత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో ఊర్వశి ధరించిన డ్రెస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ డ్రెస్ ప్రత్యేకంగా ఈమె కోసం డిజైన్ చేయించారట. న్యూయార్క్ రెట్రో ఫ్రెట్ బ్రాండ్ కు చెందిన ఈ డ్రెస్ దాదాపు 20 లక్షలు ఖర్చు చేసి ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్టు తెలుస్తుంది. ఇలా ఈమె ధరించిన ఈ డ్రెస్ ఖరీదు అక్షరాల 20 లక్షలు అని తెలియడంతో ఒక్కసారిగా అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు.
ఇక (Urvashi Rautela) ఊర్వశి నటించిన ఈ సాంగ్ కూడా హిట్ అవ్వడంతో ఈమెకు వరుసగా స్పెషల్ సాంగ్ అవకాశాలు వస్తున్నాయి. గత కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.