Nagarjuna: బిగ్ బాస్ 7 మినీ లాంచ్ లో నాగార్జున వేసుకున్న షర్ట్ అన్ని లక్షలా?

బిగ్ బాస్ రియాలిటీ షో ప్రస్తుతం తెలుగులో ఏడవ సీజన్ ప్రారంభం అయ్యి ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం మొదట్లో 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఐదు వారాలను పూర్తిచేసుకుని 5 మంది కంటెస్టెంట్ లో హౌస్ నుంచి బయటకు వెళ్లారు. ఇలా ఐదుగురు ఎలిమినేట్ కావడంతో తాజాగా అక్టోబర్ 8వ తేదీ మినీ లాంచ్ ఈవెంట్ ప్రారంభించారు.

ఇలా మినీ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరొక ఐదుగురి కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఐదుగురు హౌస్ లోకి వెళ్లారు అయితే మినీ లాంచ్ ఈవెంట్ లో భాగంగా నాగార్జున ధరించిన షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున వేసుకున్నటువంటి షర్ట్ ఏ బ్రాండ్ కు చెందినది దీని ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా (Nagarjuna) నాగార్జున వేసుకున్నటువంటి ఈ షర్ట్ లూయిస్ వ్యూటన్ బ్రాండ్ కి చెందినది అయితే దీని ఖరీదు మాత్రం భారీగానే ఉందని చెప్పాలి. ఈ షర్ట్ ఖరీదు వందలు వేళ్ళు కాకుండా ఏకంగా లక్షల్లో ఖరీదు చేస్తుందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. మరి ఈ షర్ట్ ఖరీదు ఎంత ఏంటి అనే విషయానికి వస్తే ఈ షర్ట్ ఖరీదు ఏకంగా రెండు లక్షలకు పైగా ఖరీదు చేస్తుందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

చూడటానికి ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ షర్ట్ సామాన్య ప్రజలు కేవలం చూడటానికి మాత్రమే సరిపోతుంది కానీ ఈ చొక్కాని కొని వేసుకోలేము అంటూ ఈ షర్ట్ ఖరీదు తెలిసి కామెంట్స్ చేస్తున్నారు. మరి నాగార్జున హోస్ట్ గా ఒక రియాలిటీ షో కి వస్తున్నారు అంటే ఈ మాత్రం ఖరీదైన షర్ట్స్ వేయకపోతే బాగోదు కదా అంటూ అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus