ఆ సినిమాలో లిప్ లాక్ సీన్ ఎన్ని నిమిషాలు ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

ప్రస్తుతం హిందీ సినిమాల్లో ఇంటిమేట్ సీన్లు, ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ ఉండటం సర్వసాధారణమైపోయింది. అలా కాకుండా ముద్దు సన్నివేశాలు లేకుండా సినిమాలు తీయడం చాలా అరుదు అని చెప్పడంలో తప్పులేదు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కిస్సింగ్ సీన్ లేదా లిప్‌లాక్ ట్రెండ్ ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా? లిప్‌లాక్‌ సీన్ కలిగిన తొలి హిందీ సినిమా పేరు ఏంటో తెలుసా? ఆ సినిమా గురించి చెప్పుకుందాం.

లిప్ లాక్ సన్నివేశాన్ని తెరపై చూపించిన మొదటి హిందీ చిత్రం 1947కంటే ముందే చిత్రీకరించబడింది అంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆ కాలంలో లిప్‌లాక్‌ సంగతి పక్కన పెడితే.. రొమాంటిక్‌ సన్నివేశాల చిత్రీకరణ కూడా పెద్ద విషయం. కానీ అలాంటి కాలంలోనే తొలి లిప్‌లాక్ సీన్‌ని చిత్రీకరించారు. ఈ చిత్రమే ‘కర్మ’. దేవికా రాణి, హిమాన్షు రాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 1933లో విడుదలైంది.

పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు పొందిన నటి దేవికా రాణి ఆ కాలంలోని అగ్ర నటీమణులలో ఒకరు. 1930-1940లలో టాప్ హీరోయిన్ గా కొనసాగారు. హిమాన్షు రాయ్‌తో కలిసి ‘కర్మ’ చిత్రంలో నటించారు. 1933లో విడుదలైన ఈ చిత్రం కోసం హిమాన్షుతో 4 నిమిషాల నిడివిగల ముద్దు సన్నివేశంలో పాల్గొన్నారు. ఈ సన్నివేశంలో హిమాన్షు పాము కాటుకు గురై అపస్మారక స్థితికి చేరుకుంటాడు. ఈ సమయంలో దేవిక మళ్లీ మళ్లీ ముద్దులు పెడుతుంది.

ఈ చిత్రానికి ముందే దేవికా రాణి, హిమాన్షు రాయ్ వివాహం చేసుకున్నారు. అంటే (Karma) ‘కర్మ’ చిత్రంలో దేవిక తన భర్తతో తప్ప మరెవరితోనూ లిప్‌లాక్ చేయలేదు. హిమాన్షు రాయ్ సినిమాలో నటుడిగా మాత్రమే కాకుండా దాని నిర్మాతగా కూడా వ్యవహరించారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags