సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’ ఇటీవల అంటే ఆగస్టు 10న రిలీజ్ అయ్యింది. నెల్సన్ దిలీప్ కుమార్ నటించిన ఈ సినిమాలో రజినీకాంత్ మేనరిజమ్స్ అదిరిపోయాయి. చెప్పుకోడానికి ఇందులో రజినీ ఫైట్స్ ఎక్కువగా చేసింది అంటూ ఏమీ లేదు. ఆయన ఏజ్ కి తగ్గట్టు హుందాతనం ఉన్న పాత్ర ఇది. ఫస్ట్ హాఫ్ లో రజినీకాంత్ కి తగ్గ ఎలివేషన్ సీన్స్ పెట్టాడు నెల్సన్. అందుకే గూజ్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ ఎన్నో ఇందులో ఉంటాయి.
ఇక సెకండాఫ్ లో నెల్సన్ తన మార్క్ కామెడీని ఇరికించాలి అనే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా తమన్నా – సునీల్ ట్రాక్ అన్ని వర్గాల ప్రేక్షకులకు అంతగా అలరించలేదు. అయినప్పటికీ అల్ప సంతోషులు ఎగబడి నవ్విన సందర్భాలు కూడా థియేటర్లలో కనిపించాయి. ఇది పక్కన పెడితే.. ‘జైలర్’ లో తమన్నాకి ప్రపోజ్ చేస్తూ ఓ వ్యక్తి తిరుగుతూ ఉంటాడు. అతను ఓ డైరెక్టర్ గా కనిపిస్తాడు.’జైలర్’ లో అతని పేరు బాగున్నారా బాలు.
కానీ అసలు పేరు సునీల్ రెడ్డి. ఇతను విగ్గులు పెట్టుకుంటూ, తీసుకుంటూ కనిపించిన సన్నివేశాలు కొంతమందిని నవ్వించాయి. గతంలో ఇతను నెల్సన్ తెరకెక్కించిన ‘డాక్టర్’ సినిమాలో కూడా కనిపిస్తాడు. ‘బీస్ట్’ లో కూడా ‘డాక్టర్’ లోని పాత్రనే కంటిన్యూ చేశాడు దర్శకుడు నెల్సన్. ఈ నటుడు మరెవరో కాదు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారి పెద్దబ్బాయి.
సునీల్ రెడ్డి తమ్ముడు వైభవ్ తెలుగులో ‘గొడవ’ ‘కాస్కో’ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. అతని సినిమాలకి సునీల్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. (Jailer Movie) ‘జైలర్’ తో ఇతనికి మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి.