26 ఏళ్ళ క్రితం.. టాలీవుడ్లో చోటు చేసుకున్న విచిత్రమైన సంఘటన..!

  • October 17, 2024 / 12:04 PM IST

ఏ సినిమాకి అయినా.. అసలైన పబ్లిసిటీ మొదలయ్యేది టైటిల్ నుండే..! సినిమా టైటిల్ ను బట్టి.. ప్రేక్షకులకి ఫలానా సినిమా ఎలాంటిదో ఓ ఐడియా వచ్చేస్తుంది. కానీ ‘ఓ సినిమాకి (Movie) టైటిల్ పెట్టడం అనేది చిన్న విషయం కాదు’ అని ఫిలిం మేకర్స్ అంటుంటారు. పబ్లిసిటీ వస్తుంది కదా అని.. ఏదో ఒక టైటిల్ పెట్టినా చాలా సమస్యలు వస్తుంటాయి. ఉదాహరణగా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  సినిమాని చెప్పుకోవచ్చు. ఆ సినిమా టైటిల్ విషయంలో నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే.

Movie

‘మా సినిమాకి (Movie) మేము గుంటూరు కారం అనే టైటిల్ పెట్టడం అనేది చాలా చెప్పు అనిపించింది. దాని వల్ల కథకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. మాది ఫ్యామిలీ సినిమా.. కానీ టైటిల్ ను బట్టి అంతా మాస్ సినిమా అనుకున్నారు. అందువల్ల ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు డిస్- కనెక్ట్ అయిపోయారు’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగ వంశీ చెప్పుకొచ్చారు. సో టైటిల్ విషయంలో ఫిలిం మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. తీసుకుంటారు కూడా..!

అయితే ఓ దర్శకుడు మాత్రం తన సినిమాకి టైటిల్ పెట్టకుండా రిలీజ్ చేసేశాడు. ‘సినిమా చూసి మీరే మా సినిమాకి టైటిల్ పెట్టండి’ అంటూ ప్రేక్షకులకు ఆ బాధ్యత అప్పగించాడు. అతను మరెవరో కాదు బి.వి.రమణ. తరుణ్ తో ‘ఎలా చెప్పను’, సుమంత్ తో ‘గౌరీ’, గోపీచంద్ తో ‘ఒంటరి’ వంటి క్రేజీ సినిమాలు తీశాడు రమణ. అయితే వీటికంటే ముందుగా జె.డి.చక్రవర్తి ( J. D. Chakravarthy) , మీనా (Meena) ..లని హీరో హీరోయిన్లుగా పెట్టి ఓ సినిమా తీశాడు. జయసుధ ఇందులో కీలక పాత్ర పోషించింది.

కథ మొత్తం ఓ స్టార్ హోటల్లో జరుగుతుంటుంది. తల్లిని పోగొట్టుకున్న కూతురుకి అన్నీ తానై ఉండాలనే ఓ తండ్రి. అనుకోకుండా కొందరు దుండగులు అతని కూతుర్ని కిడ్నాప్ చేసి.. ఓ మర్డర్ కేసులో ఇరికించాలి అనుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనే సస్పెన్స్ ను రేకెత్తిస్తూ ఈ కథ సాగుతూ ఉంటుంది. ఈ సినిమాకి టైటిల్ పెట్టకుండా విడుదల చేశారు. సరైన టైటిల్ పెడితే క్యాష్ ప్రైజ్ ఇస్తామని ప్రకటించారు.

1998 అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కొంతమంది ప్రేక్షకులకి నచ్చింది.. ఇంకొంతమంది ప్రేక్షకులకి నచ్చలేదు. అయితే సినిమా చూశాక.. చాలా మంది ఈ సినిమాకి ‘పాపే నా ప్రాణం’ అనే టైటిల్ బాగా సూట్ అవుతుంది అని అభిప్రాయపడ్డారు. దీంతో ఆ టైటిల్ నే తమ సినిమాకి పెట్టుకున్నారు మేకర్స్. ఇక నేటితో ‘పాపే నా ప్రాణం’ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 26 ఏళ్లు పూర్తి కావస్తోంది.

మోక్షజ్ఞ డెబ్యూ.. ఇది మరో లీక్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus