రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2007లో చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకుపోయాడు. చిరంజీవి తనయుడు కావడంతో రామ్ చరణ్ తో సినిమాలు చేసేందుకు దర్శకుడు సైతం పోటీపడేవారు. మగధీర సినిమాతో రామ్ చరణ్ టాలీవుడ్ టాప్ హీరోగా నిలిచాడు. తరువాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రపంచమంతటా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే రామ్ చరణ్ అతి చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.
ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. చిన్నతనంలో రామ్ చరణ్ చాలా క్యూట్ గా, ముద్దుగా ఉండడంతో దర్శకులు సైతం రామ్ చరణ్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయడానికి పోటీపడేవారట. అయితే చిరంజీవి నటించిన లంకేశ్వరుడు సినిమాలో రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారట. ఆ సినిమాలో రామ్ చరణ్ అంతగా నటించకపోవడంతో ఎడిటింగ్ లో తీసేసారని సమాచారం. అతి చిన్న వయసు కావడంతో చరణ్ యాక్టింగ్ చేయడానికి ఇబ్బందిపడేవారట.
దీంతో చిరంజీవి తను పెద్దయ్యాక సినిమాల్లోకి తీసుకువస్తానని చెప్పారట. చిరంజీవి 9 ఏళ్ల తరువాత సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన సినిమా జైదీ నెం.150 మరియు ఆచార్య సినిమాల్లో రామ్ చరణ్ –చిరంజీవితో కలిసి నటించిన విషయం అన అందరికి తెలిసిందే.. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. (Ram Charan) రామ్ చరణ్, ఉపాసన అనే అమ్మాయిని 14 జూన్, 2012న వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన 12 సంవత్సరాలకి వారిద్దరూ జూన్ 20, 2023న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్