టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణకు సేవా గుణం ఎక్కువనే సంగతి తెలిసిందే. ఇతరులకు సహాయం చేసే విషయంలో బాలయ్యకు ఎవరూ సాటిరారు. బసవతారకం ఆస్పత్రి ద్వారా బాలయ్య ఎంతోమందికి వైద్య చికిత్స అందేలా చేశారు. బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బసవతారకం ఆస్పత్రి గురించి, బాలయ్య గురించి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బసవతారకం ఆస్పత్రికి భరత్ ట్రస్టీగా ఉన్నారు. ఆ ఆస్పత్రి గురించి భరత్ మాట్లాడుతూ నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఆపరేట్ చేసే నాన్ ప్రాఫిట్ ఆస్పత్రి లేదని అన్నారు.
మిగతా ఆస్పత్రులన్నీ లాభాపేక్ష కోసమే పని చేస్తున్నాయని ఆయన (Balakrishna) చెప్పుకొచ్చారు. ఈ ఆస్పత్రి ద్వారా వచ్చిన లాభాలను బాలయ్యగారో, నేనో తీసుకోలేదని తీసుకోవాలనే ఆలోచన కూడా లేదని ఆయన తెలిపారు. కొంతమంది డాక్టర్లు ఈ ఆస్పత్రిని వదిలి మరో అస్పత్రికి వెళితే ఎక్కువ వేతనం వస్తుందని అయినా ఇక్కడ దొరికే గౌరవం ఎక్కడా దొరకదనే కారణం వల్ల వాళ్లు వెళ్లడం లేదని భరత్ కామెంట్లు చేశారు.
అక్కడ డాక్టర్లలో ఉన్న గొప్పదనం ఏంటంటే అందరినీ ఒకేలా చూస్తారని ఆయన తెలిపారు. ఆ ఆస్పత్రిలో మంచి చికిత్స దొరుకుతుందనే నమ్మకంతో వస్తారని భరత్ వెల్లడించారు. ఇండియాలో ఇతర ప్రాంతాల నుంచి బసవతారకం ఆస్పత్రికి వస్తున్నారని ఆయన తెలిపారు. ఆ ఆస్పత్రి ద్వారా లాభాలు రావని ఆయన చెప్పుకొచ్చారు.
క్యాన్సర్ కు చికిత్స చాలా ఖర్చుతో కూడిందని భరత్ తెలిపారు. భరత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బసవతారకం ఆస్పత్రి కోసం బాలయ్య కష్టపడుతున్న తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. బాలయ్య గురించి ఈ విషయాలు తెలిస్తే కచ్చితంగా ఫిదా అవుతారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
హీలీవుడ్లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?