Karthikeya: రాజమౌళి కుమారుడు హీరో కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో మంది స్టార్ హీరోలు నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటికే చాలామంది హీరోలు సినిమాలు చేసి పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందారు. దర్శకత్వంలో ఎంతో ప్రతిభ కలిగి ఉన్నటువంటి రాజమౌళి ఎంతో మంది హీరోలను స్టార్లుగా తీర్చిదిద్దారు. ఇక రాజమౌళికి కూడా కార్తికేయ అనే కుమారుడు ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఈయన కూడా హీరో కటౌట్ కి ఏ మాత్రం తీసుపోడు. అచ్చం హీరో మాదిరిగానే ఉన్నటువంటి కార్తికేయను హీరోగా చేయాలని రాజమౌళి ఎందుకు అనుకోలేదు అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అయితే కార్తికేయ ఎందుకు హీరో కాలేదు అనే విషయాలను ఒక సందర్భంలో రాజమౌళి స్వయంగా వెల్లడించారు. రాజమౌళి తన కుమారుడు కార్తికేయను కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించారు అయితే కార్తికేయకు మాత్రం సినిమాలలో నటించడానికి ఏమాత్రం ఇష్టం లేదట.

తనకు హీరోగా సినిమాలలో నటించడం కన్నా ఆ సినిమాను బిజినెస్ చేయడమే తనకి ఎంతో ఇష్టమని రాజమౌళి ఓ సందర్భంలో తెలియజేశారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమాల బిజినెస్ వ్యవహారాలను కార్తికేయ దగ్గరుండి చూసుకుంటున్నారు. తాజాగా త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవడంలోనూ కార్తికేయ కృషి ఎంతో ఉందనే విషయం మనకు తెలిసిందే.

ఇలా బిజినెస్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి కార్తికేయ హీరోగా రావడం కన్నా బిజినెస్ రంగం వైపే ఆసక్తి చూపించడంతో రాజమౌళి కూడా తనను బిజినెస్ రంగంలోనే ప్రోత్సహించారట అదే విధంగా తన కుటుంబంలో బిజినెస్ చూసుకోవడానికి కూడా ఎవరూ లేకపోవడంతో ఆ బాధ్యతలను చూసుకోవడానికి కార్తికేయ ఉన్నారని అందుకే తాను హీరోగా ఇండస్ట్రీలోకి రాలేకపోయారు అంటూ ఈ సందర్భంగా రాజమౌళి (Karthikeya) కార్తికేయ హీరో కాకపోవడానికి కారణాన్ని తెలియజేశారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus