RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీపై డాక్టర్ స్ట్రేంజ్ డైరెక్టర్ రివ్యూ ఇదే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ మూవీలో తారక్ లుక్ విషయంలో జక్కన్న మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమైనా తారక్ అభినయంతో సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లారనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఇంటర్వల్ సీన్ ను చూసి మతిపోయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా డాక్టర్ స్ట్రేంజ్ డైరెక్టర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం వ్యక్తం చేయడం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై 100 రోజులు దాటినా ఈ సినిమా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. తారక్ ట్రక్ నుంచి జంతువులతో పాటు కిందికి దూకే సీక్వెన్స్ మతి పోయేలా ఉందని డాక్టర్ స్ట్రేంజ్ డైరెక్టర్ స్కాట్ డెరిక్ అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా భార్యాపిల్లలతో కలిసి ఈ సినిమాను చూశానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమా నాకు రోలర్ కాస్టర్ రైడింగ్ లా అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు.

స్కాట్ డెరిక్ చేసిన పోస్ట్ లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ ప్రముఖులు గతంలో ఏ సినిమాను ప్రశంసించని స్థాయిలో ఈ సినిమాను ప్రశంసించడం గమనార్హం. ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్ అయిన జేమ్స్ గన్ కూడా ఆర్ఆర్ఆర్ మూవీ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో రాజమౌళి పేరు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో మారుమ్రోగుతోంది.

నిర్మాత డీవీవీ దానయ్యకు ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించిందని సమాచారం అందుతోంది. నిర్మాతగా డీవీవీ దానయ్య రేంజ్ ను పెంచిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మూవీ ఒకటని చెప్పవచ్చు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus