Sharwanand: నెక్స్ట్‌ సినిమాలో రాజకీయం చేస్తా: శర్వానంద్‌

‘ఒకే ఒక జీవితం’ సినిమా చూసొచ్చి.. కొంతమంది ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటున్నారట. మరికొంతమంది బోరున ఏడ్చేస్తున్నారట. ఇంకొంతమంది బరువెక్కిన హృదయంతో ఇళ్లకు వెళ్తున్నారట. ఈ మాట మేం చెప్పడం కాదు. చాలామంది సెలబ్రిటీలే చెప్పారు. ఆ సినిమాలోని భావోద్వేగాలు అలా ఉన్నాయట. అయితే అలాంటి పాత్రను చక్కగా పండించిన హీరో శర్వానంద్‌ అలాంటి పాత్ర చేయడానికి ముందుకు రావడం లేదు. కారణం వైద్యుల సూచనే అంటున్నారు. దీని గురించి ఇటీవల ఆయన మాట్లాడారు.

నా సినిమా ఇంత వసూలు చేయాల్సిందే అని లెక్కలేసుకోలేదు అని చెప్పిన శర్వానంద్‌.. ఇంతే వచ్చిందేమిటి అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. సినిమా ఫలితంపై ప్రేక్షకుల్ని కానీ, మరొకరిని కానీ తప్పు పట్టను అని చెప్పాడు. ‘ఒకే ఒక జీవితం’ లాంటి కథ ఇంత వసూలు చేయడం గొప్ప విషయం. సినిమా వచ్చిన ఇన్ని రోజులైనా విజయవంతంగా ప్రదర్శితమవుతుండడం ఇంకా గొప్ప విషయం అని అన్నాడు శర్వా. సినిమా కథ, అందులోని మన పాత్ర నటులకి సౌకర్యంగా అనిపించదు.

కెమెరా ముందుకెళ్లి మనం కానిది చేసి చూపిస్తాం అంటూ పాత్రల పట్ల తన క్లారిటీ ఇచ్చాడు. ఎమోషన్స్‌ ఎక్కువగా ఉండే పాత్రలు చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉంటుంది. వాటి నుండి బయటికు రావడం చాలా కష్టం అంటుంటారు. నాకు అది ఇంకా అలవాటు కాలేదు. అందుకే ఇలాంటి పాత్రలు చేయొద్దని డాక్టర్లు నాకు సలహాలు ఇచ్చారు అని నవ్వుతూ చెప్పాడు శర్వా. ఇక వ్యక్తిగతంగా వినోదాత్మక సినిమాలు, పాత్రల్ని బాగా ఇష్టపడతా.

వాటిలో నటించడాన్ని ఆస్వాదిస్తాను కూడా. థియేటర్‌ నుండి బయటకు వచ్చాక.. ఆ సినిమాను గుర్తు చేసుకుని సంతోషంగా గడపొచ్చు అని చెప్పాడు శర్వా. తన తర్వాతి సినిమా రాజకీయ ప్రధానంగా ఉంటుందని తెలిపిన శర్వా.. కృష్ణచైతన్య దర్శకత్వం ఆ సినిమా తెరకెక్కుతుందని చెప్పాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో అలాంటి పాత్ర చేయలేదు అని కూడా చెప్పాడు. దీంతోపాటు మరో మూడు కథలు కూడా విన్నానని, అవి ఓకే చేశా అని కూడా చెప్పాడు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus